Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత ఓ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ యాడ్ చేశారు. తెలుగు కొత్త సంవత్సరాది రోజున ఈ యాడ్‌ను విడుదల చేశారు. కాస్త వెరైటీగా యాడ్‌ని ప్లాన్ చేయగా, ఈ యాడ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ యాడ్ కోసం చిరంజీవి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ యాడ్ కోసం చిరంజీవి దాదాపుగా రూ. 7 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్కో సినిమా కోసం రూ. 20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న చిరంజీవి యాడ్ కోసం రూ. 7 కోట్ల వరకు చార్జ్ చేసినట్టు సమాచారం.
కొన్ని నిమిషాల యాడ్ కోసం చిరంజీవి అంత మొత్తం వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చిరంజీవి వంటి సీనియర్ హీరో ఈ యాడ్ చేయడంతో శుభగృహ రియల్ ఎస్టేట్‌కు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో చూడాలి. ఈ యాడ్‌ను సుకుమార్ డైరెక్ట్ చేశారు. గతంలో చిరంజీవి.. కృష్ణవంశీ దర్శకత్వంలో థమ్స్ అప్‌తో పాటు నవరత్న ఆయిల్‌కు పదమూడేళ్ల క్రితం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీటైంది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తొలిసారి పూర్తి స్థాయిలో తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక మోహన్ రాజా డైరెక్షన్‌లో గాడ్ ఫాదర్ అనే టైటిల్‌తో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించిన షూట్ పూర్తయింది. దీంతో పాటు చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. దాంతోపాటు బాబీ సినిమా చేస్తున్నారు. ఇంకోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఇలా చిరంజీవి ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు యాడ్ లో నటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…