Chiranjeevi : హైదరాబాద్ లో విలువైన ఆస్తులను అమ్ముకున్న చిరు.. ఆచార్య న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసేందుకేనా..?

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగారు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే కోట్ల ఆస్తులు కూడ‌బెట్టారు. ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఇక చిరంజీవికి ఎన్నో చోట్ల ఆస్తులున్నాయి. చెన్నైలో ఎన్నో విలువైన భూములు, ఆస్తులను ప్రజారాజ్యం టైంలో అమ్మేశారని అంటుంటారు. అయినా చిరంజీవికి హైద‌రాబాద్‌లో చాలాచోట్ల ఖరీదైన భూములున్నాయి.

చిరు తన సంపాదనలో చాలా భాగం భూమి మీదే పెట్టారని అంటుంటారు. అయితే తాజాగా చిరు తన విలువైన ఓ ఆస్తిని అమ్మేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. హైదరాబాద్ ఫిలిం నగర్‌లో మెయిన్ రోడ్‌లో 3000 గజాల స్థలం ఉంది. అప్పట్లో దీన్ని ఆయన రూ.30 లక్షలకు కొనుగోలు చేశారని టాక్ ఉంది. ఇప్పుడు ఆ అత్యంత విలువైన స్థలాన్ని అమ్మేశారని తెలుస్తోంది. అంత విలువైన స్థ‌లాన్ని చిరంజీవి అమ్మాల్సిన అవ‌స‌రం ఎందుకు వ‌చ్చింది అని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఈ స్థ‌లం అమ్మ‌డానికి కార‌ణం ఓ ప్రముఖ దినపత్రిక యజమాని ఎప్పటి నుంచో ఆస‌క్తి చూపుతున్నారని తెలుస్తోంది.

Chiranjeevi

గత కొన్నేళ్లుగా ఆ దినపత్రికకు చెందినవారు ఈ మేరకు చిరును అడుగుతున్నారని సమాచారం. ఇక్కడ ఆయన ఆ దినపత్రిక ఛాన‌ల్ కార్యాలయం నిర్మిస్తారని అంటున్నారు. అయితే చిరు స్థలానికి అమ్మ‌కం, కొనుగోలు రెండు పూర్త‌యినట్లు తెలుస్తుండ‌గా సుమారు రూ.70 కోట్లకు కాస్త అటు ఇటుగా ఈ డీల్ కుదరిందని సమాచారం. ఫిలింనగర్‌లో గజం రెండు లక్షలకు పైగానే పలుకుతోంది. ఈ డీల్ రెండున్నర లక్షలకు కాస్త తక్కువగా జరిగిందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మరి చిరు అంత తక్కువకు ఆ స్థలాన్ని అలా ఎందుకు అమ్మారనే చర్చ నడుస్తోంది. అయితే ఆచార్య కార‌ణంగా వ‌చ్చిన న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసేందుకే ఆయ‌న ఆ స్థ‌లం అమ్మార‌ని అంటున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ఆచార్య తర్వాత మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ సినిమాల్లో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM