Chiranjeevi : మెగా స్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా తరువాత నెల రోజుల పాటు కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లాలని చిరంజీవి ఎప్పుడో నిర్ణయించుకున్నారు. కానీ పరిస్థితుల కారణంగా ఈ ట్రిప్ వాయిదా పడింది.

కాగా చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి మే 1న యూఎస్ఏ వెళ్లాలని అనుకున్నారు. కానీ సినీ ఇండస్ట్రీలో జరిగే మేడే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా చిరంజీవిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గాను చిరంజీవి తన ప్రయాణాన్ని రెండు రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా తన భార్య సురేఖతో కలిసి యూఎస్ఏ వెళ్తున్న ఫోటోను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు.
ఇదిలా ఉండగా చిరంజీవి మరో రెండు సినిమాలను తెరకెక్కించే పనిలో చాలా బిజీగా ఉన్నారు. మళయాళం సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్ లో చిరంజీవి నటిస్తున్నారు. దీనికి గాడ్ ఫాదర్ అనే పేరును కూడా నిర్ణయించారు. దీంతోపాటు మరో తమిళ సినిమా వేదాళంను కూడా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. దీనికి భోళా శంకర్ అనే పేరు పెట్టారు. ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. అలాగే కె.ఎస్.రవి చంద్ర, వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ ఆయన ఇంకో రెండు సినిమాలలో నటించనున్నారు.