Chiranjeevi : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయపై మెగాస్టార్ చిరంజీవి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి తనకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు అనసూయకు మెగాస్టార్ వార్నింగ్ ఇవ్వడం ఏంటి ? ఇలా తనకి వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి.. అనే విషయానికి వస్తే..
మెగాస్టార్ చిరంజీవి మళయాళంలో వచ్చిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇందులో అనసూయ ఒక న్యూస్ ఛానల్ నడుపుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలలో చిక్కుకున్న అనసూయకు చిరంజీవి ప్రత్యర్థులు తన న్యూస్ ఛానల్ లో చిరంజీవి గురించి చెడుగా ప్రచారం చేస్తే తనని ఆదుకుంటామని చెబుతారు. తన ఛానల్ నడవడం కోసం అనసూయ.. చిరంజీవి పై దుష్ప్రచారం చేస్తుంది.
ఈ దుష్ప్రచారం కారణంగా చిరంజీవి ఏకంగా జైలుకు కూడా వెళ్తారు. కానీ చిరంజీవి ప్రత్యర్థులు మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అనసూయని కూడా మోసం చేస్తారు. అయితే జైలు నుంచి బయటకువచ్చిన తర్వాత చిరంజీవి అనసూయకి ఉన్న ఆర్థిక కష్టాలను తీర్చడమే కాకుండా ఆ సమయంలో ఆమెకు గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తారు. ఇలా ఈ సినిమాలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి అనసూయకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…