Chiranjeevi : ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కరోనాతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది. ఆసుపత్రి ఖర్చులు లక్షలలో అవుతున్న నేపథ్యంలో చిన్నకుమారుడు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరాడు. ఇప్పటికే సోనూసూద్, కోలీవుడ్ హీరో ధనుష్ లు శివ శంకర్ మాస్టర్ కు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చారు.
శివ శంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే శివశంకర్ మాస్టార్ తనయుడికి కాల్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా 3 లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి.. శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నాం అని అభయమిచ్చారు.
శివశంకర్ మాస్టర్ కుమారుడు అజయ్ మాట్లాడుతూ.. చిరంజీవి అంటే నాన్నగారికి చాలా ఇష్టం. ఇటీవల ఆచార్య షూటింగ్ లో కూడా నాన్నగారు చిరంజీవిని కలిశారని అజయ్ గుర్తుచేసుకున్నారు. శివ శంకర్ మాస్టార్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ ఆయన తిరిగి సినిమాలు చేయాలని.. అభిమానులు కోరుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…