Chiranjeevi Britney Spears : మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా మెగాస్టార్ ఈ మూవీలో కనిపించనుండడంతో ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌ను గాడ్ ఫాదర్ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్‌లో నటింపజేయాలని చిత్ర బృందం చూస్తున్నదట. అందులో భాగంగానే బ్రిట్నీ స్పియర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె అందులో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. అయితే బ్రిట్నీ స్పియర్స్ స్పెషల్ సాంగ్‌కు చెందిన సమాచారాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏదేమైనా ఓ హాలీవుడ్ పాప్ సింగర్‌ను టాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్‌కు తీసుకుంటున్నారంటే.. టాలీవుడ్ స్థాయి ఒక మెట్టు పైకి ఎదిగిందనే చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…