Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని ఆయన అభిమానులు ఎంత ప్రాణంగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని తెలిస్తేనే విలవిలలాడిపోతారు. అలాంటిది రీసెంట్‌గా చిరు చేతికి పెద్ద కట్టుతో కనిపించారు. దీంతో అభిమానులు కంగారు పడ్డారు. ఆందోళన చెందారు. ఏం జరిగిందా ? అంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే చిరంజీవి తన చేతి గాయంపై వివరణ ఇచ్చారు.
చిరంజీవి తన చేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ..కుడి చేతితో ఏదైనా పనిచేస్తున్నప్పుడు నొప్పిగా, తిమ్మిరిగా అనిపిస్తుండటంతో వైద్యులను సంప్రదించాను. కుడిచేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్‌పై ఒత్తిడి పడటమే నొప్పికి కారణమని వైద్యులు తేల్చారు.. దీనిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని.. వారు పేర్కొన్నారు.
అపోలోలో నా చేతికి సర్జరీ జరిగింది. నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సరిచేసి ఒత్తిడిని తగ్గించారు. పదిహేను రోజుల్లో కుడి చేయి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అభిమానులెవరూ కంగారు పడాల్సిన పనిలేదు.. అని చిరంజీవి స్పష్టం చేశారు. సర్జరీ వల్ల గాడ్ ఫాదర్ షూటింగ్‌లో పాల్గొనలేకబోతున్న చిరంజీవి నవంబర్ 1 నుండి మళ్లీ షూటింగ్‌తో బిజీ కానున్నారు. 66 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…