Chiranjeevi : టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ డ్రామా గాడ్ ఫాదర్. మళయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సాలిడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
అయితే ప్రొడక్షన్ హౌస్ సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేయకపోవడంతో ట్రేడ్ వర్గాలు, ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఎందుకు ప్రమోషన్స్ ప్రారంభించట్లేదు అని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టారు. అది కూడా ఏకంగా ఆకాశంలో ఒక స్పెషల్ జెట్ విమానంలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించి ఒక్కసారిగా అందరి అంచనాలను పెంచేశారు. పైగా హాట్ యాంకర్ శ్రీముఖి.. చిరంజీవి మధ్య సరదా సంభాషణలతో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు.
ఇప్పటి వరకు ఏ సినిమా ఈ రకంగా ఆకాశంలో ప్రమోషన్లు చేయలేదు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక పెళ్లి తర్వాత నయనతార తెలుగులో నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ప్రమోషన్ లో శ్రీముఖి – చిరంజీవి మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. చిరు వేసిన పంచ్ డైలాగ్ కు శ్రీముఖి ఏకంగా ఐ లవ్ యూ చిరంజీవి గారు.. తట్టుకోలేకపోతున్నా అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఏదేమైనా శ్రీముఖి.. చిరంజీవి మధ్య అదిరిపోయే మెగామాస్ ఇంటర్వ్యూ రెడీ అయ్యింది. చూసి ఎంజాయ్ చేయండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…