Prabhas : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హిరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు హీరోలు కథ నచ్చకనో, ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో మిస్ చేసుకున్న సినిమా కథలు మరో హీరో వద్దకు వెళ్లడం, సినిమా బాగుండి సూపర్ హిట్ అవ్వడం సాధారణమే. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లోనూ అలా మిస్ చేసుకున్న 5 సూపర్ హిట్ సినిమాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఒక్కడు. అయితే ఈ సినిమా కథను మొదట డైరెక్టర్ గుణశేఖర్ ప్రభాస్ కు చెప్పడంట. కానీ కబడ్డీ ఆటపై ప్రభాస్ కు గ్రిప్ లేకపోవడంతో వదులుకున్నాడట.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా నాయక్. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ముందుగా ప్రభాస్ వద్దకే వెళ్లింది. కానీ స్టోరీ నచ్చకపోవడంతో ప్రభాస్ ఈ సినిమాకు నో చెప్పాడట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమా కథను మొదటగా సుకుమార్ ప్రభాస్ కు వినిపించాడు. కానీ ప్రభాస్ పెద్దగా ఆసక్తిచూపించకపోవడంతో ఆ కథను అల్లు అర్జున్ తో తీసి హిట్ కొట్టాడు.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమా కథను డైరెక్టర్ సురేందర్ రెడ్డి మొదట ప్రభాస్ తో తీయాలని అనుకున్నాడు. కానీ ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో రవితేజను హీరోగా పెట్టి తీశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి ఛత్రపతి సినిమా కంటే ముందే ప్రభాస్ తో ఓ సినిమా తీయాలనుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాను మొదట ప్రభాస్ కు వినిపించాడు. కానీ ప్రభాస్ సింహాద్రి కథ తనకు సెట్ అవదని వదులుకున్నాడట. ఇలా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం హిట్ కొట్టడం కామనే. అలా పలు బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ప్రభాస్ మిస్ అయ్యాడని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…