Chiranjeevi : పూరీ జగన్నాథ్‌కు డైనమిక్ డైరెక్టర్‌గా ఎంతో పేరుంది. మాస్ ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇచ్చే డైలాగ్‌లను సినిమాల్లో పెడుతుంటారు. ఆయన తీసిన సినిమాల్లో కొన్ని ఫ్లాపులు ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా పూరీకి ప్రేక్షకుల్లో మంచి పేరే ఉంది. అయితే ఆయన చిరంజీవితో సినిమా చేయలేదు. వారిద్దరి మధ్య ఏమైందో కూడా చాలా మందికి తెలియదు. కానీ తాజాగా చిరు 154 మూవీకి ఆయన అతిథిగా హాజరవడం చూస్తుంటే.. పాత గొడవలు, మనస్ఫర్థలు అన్నీ మరిచిపోయారని.. పూరీ మెగా కాంపౌండ్‌కు దగ్గరయ్యారని అనిపిస్తోంది.
చిరంజీవి 154వ చిత్రాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. పూరీ జగన్నాథ్, రాఘవేంద్ర రావు, వినాయక్ వంటి వారు హాజరై చిత్రాన్ని లాంచ్ చేశారు. అయితే పూరీ సడెన్‌గా చిరంజీవి ప్రోగ్రామ్‌లో ప్రత్యక్షమైనందుకు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో చిరంజీవితో ఆటో జానీ సినిమాను పూరీ ప్లాన్ చేశాడు. మొదటి పార్ట్ నెరేషన్ బాగానే వచ్చిందన్నారు. కానీ ఏమైందో తెలియదు, ఆ ప్రాజెక్ట్ అటకెక్కేసింది. తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు.
అయితే చిత్రంలో సెకండాఫ్ బాగా లేదని చిరంజీవి బయటి వ్యక్తులతో అన్నారట. అదేదో తనకే చెబితే ఇంకో వెర్షన్ రాసి ఇచ్చే వాణ్ని కదా.. అని పూరీ విచారించాడట. దీంతో ఆటో జానీ కాస్తా మధ్యలోనే ఆగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ గతం గతః. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పూరీ సడెన్‌గా చిరు మూవీకి గెస్ట్‌లా వచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇద్దరూ కలసి భవిష్యత్తులో ఏదైనా సినిమా చేస్తారేమోనని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి వీరి క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందో, రాదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…