Bigg Boss 5 : ప్రస్తుతం బిగ్ బాస్ 5 సీజన్ ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. ప్లేయర్లు ఒకరితో ఒకరు పోటీలు పడి మరీ టాస్కులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో సమాచారం అందుతోంది. బిగ్ బాస్‌ను చూసేవారికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి తెలుసు. అయితే మొదటి సీజన్‌లో నవదీప్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకువచ్చి రచ్చ రచ్చ చేశారు.
ఇక రెండు, మూడు, నాలుగో సీజన్లలోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీల రూపంలో కంటెస్టెంట్లు సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదా ? అని అందరిలోనూ సందేహాలు నెలకొంటున్నాయి. దీనిపై షో నిర్వాహకులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ప్రోమోల్లోనూ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి.
ఇక ప్రస్తుత సీజన్‌కు గాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవసరం లేదని షో నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సీజన్ ఇప్పటికే టఫ్‌గా మారింది. కంటెస్టెంట్లు చాలా హార్డ్‌గా పోటీ పడుతున్నారు. వారిలో వారికే కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. పైగా టీఆర్‌పీ రేటింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి. దీంతోపాటు 60 రోజులు కూడా దాటి పోయింది. కనుక ఈ దశలో వైల్డ్ కార్డ్ ఎంట్రీని తెస్తే బాగుండదేమోనని, కంటెస్టెంట్లు ఇప్పటికే బాగా ఆడుతున్నారు కనుక వారి గేమ్ డిస్టర్బ్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకనే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఈ సారి ప్రవేశపెట్టడం లేదని తెలుస్తోంది.
హౌస్‌లో కంటెస్టెంట్లు బాగా ఆడలేకపోయినా, షో చప్పగా సాగినా, రేటింగ్స్ లేకపోయినా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీని తెచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుత సీజన్‌లో అన్నీ బాగానే ఉన్నాయి. రేటింగ్స్ కూడా ఉన్నాయి. ఒక ఫ్లోలో సాగుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీని తెస్తే పరిస్థితి మారితే.. అప్పుడు తలలు పట్టుకోవాల్సి వస్తుందని, అలాంటి రిస్క్ ఎందుకని నిర్వాహకులు భావిస్తున్నారట. కనుక.. ఈ సీజన్‌కు ఇక ఇంతేనని.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోదని స్పష్టమవుతోంది. మరి నిర్వాహకులు ఏం చేస్తారో చూడాలి. దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…