Chiranjeevi : సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల ప్రభావం అటు రాజకీయంగా, ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా కలకలం రేపాయి. ముఖ్యంగా ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని తప్పుబడుతూ జగన్ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్పష్టం చేశారు.
ఇదే సమయంలో చిరంజీవి కూడా తనతో మాట్లాడినట్లు, రిపబ్లిక్ డే రిలీజ్ వేడుకలో జరిగిన పరిణామాలకు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్టు.. పేర్ని నాని ఆ మధ్య మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి చేసిన కామెంట్స్‌తో పవన్ హర్ట్ అయ్యారని, ఇద్దరికీ అస్సలు పడట్లేదని గాసిప్స్ గుప్పుమన్నాయి. కానీ వీటిని పటాపంచలు చేశారు మెగా బ్రదర్స్.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, చిరంజీవి రీసెంట్‌గా ఓ పెళ్లి వేడుకలో కలసి కనిపించి కనువిందు చేశారు. మాజీ మంత్రి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో జరిగింది. అక్కడికి మెగాస్టార్, పవర్‌స్టార్ వచ్చారు. ఏదో సందర్భంలో వీరిద్దరూ కలసి తెగ నవ్వుకున్నారు. ఆ ఫొటోలు చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. పవన్ కల్యాణ్ తన అన్నయ్య చేతిలో చేయి వేసి నవ్వుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి వైరల్‌గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…