Chethana Uttej : సీనియర్ నటుడు ఉత్తేజ్ కూతురు చేతన ఇప్పుడు గర్భవతి అనే సంగతి తెలిసిందే. చేతన త్వరలోనే తల్లి కాబోతోంది. రీసెంట్‌గా ఆమె మెటర్నటీ షూట్ చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తానని, కొడుకు పుట్టినా ఆనందమే అని పేర్కొంది. చేతన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా చేతన సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సింగర్లు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను ఉత్తేజ్ చిన్న కూతురు పాట ఉత్తేజ్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. మరి కొద్ది రోజులలో చేతన పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. చిత్రం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన చేతన పలు సినిమాల్లో నటించింది.
https://www.instagram.com/p/CWapS1rpEG9/
హీరోయిన్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది చేతన. నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకోవడంతో ఉత్తేజ్ కొంతకాలం పాటు కూతురితో మాట్లాడలేదు. ఇప్పటికీ కొంత దూరం మెయింటైన్ చేస్తున్నాడని టాక్.
ఇటీవల ఉత్తేజ్ భార్య పద్మ అనారోగ్యంతో మరణించారు. క్యాన్సర్ బారిన పడిన పద్మ చికిత్స తీసుకుంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. భార్య మరణం మానసికంగా ఉత్తేజ్ ని కృంగదీసింది. మెగాస్టార్ చిరంజీవితోపాటు టాలీవుడ్ ప్రముఖులు పద్మ అంత్యక్రియలకు హాజరై ఉత్తేజ్ ని ఓదార్చారు.