Chennakesava Reddy : ఆది వంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన వినాయక్ ఆ తర్వాత బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి సినిమా తీశాడు. ఇందులో బాలయ్య డ్యుయల్ రోల్‌లో అదరగొట్టేశాడు. ముఖ్యంగా ఇందులోని డైలాగ్స్ ఫ్యాన్స్‌కు తెగనచ్చేశాయి. టాలీవుడ్‌లో ప్రజెంట్ స్టార్ హీరోల ఓల్డ్ సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తుంది. ఆ స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను తిరిగి ప్రీమియర్ షోలుగా వేస్తున్నారు.
అందులో భాగంగా మహేష్ పోకిరి, ఒక్కడు సినిమాలను మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఇందులో పోకిరి ఎక్కువ షోలతోపాటు ఏకంగా భారీ వసూళ్లు కొల్లగొట్టింది. అయితే పవన్ జల్సా సినిమా పోకిరి వసూళ్లను క్రాస్ చేసేసింది. చివరకు శృతి హాసన్, ధనుష్ త్రి సినిమాను సైతం నిర్మాత నట్టి కుమార్ రీ రిలీజ్ చేస్తే మంచి వసూళ్లే వచ్చాయి. ఈ మధ్య కొత్త సినిమాల రిలీజ్ కు సైతం రాని ఎక్సయిట్మెంట్ దీన్ని చూశాక వస్తోంది అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు బాలయ్య వంతు వచ్చేసింది. బాలయ్య నటించిన హిట్ సినిమా చెన్నకేశవరెడ్డిని రీ రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతోంది. రీ రిలీజ్ నేపథ్యంలో ఈ భారీ మాస్ యాక్షన్ సినిమాకు ఓవర్సీస్‌లో ఇప్పటికే షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయో లేదో వెంటనే అడ్వాన్స్ బుకింగ్ లలో ఈ సినిమా దుమ్ము రేపుతోందని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాలో శ్రియా శరణ్, టబు హీరోయిన్లుగా నటించారు. ఆ రోజుల్లోనే 158 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన ఈ సినిమా 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇప్పుడు బాలయ్య మూవీ పవన్ రికార్డులను బద్దలు కొడుతుందో లేదో చూడాలి.