Naga Babu : మెగా బ్రదర్‌గా పేరుగాంచిన నాగబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటుడిగా, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశారు. తన సినీ కెరీర్‌ను ఈయన 1986లో రాక్షసుడు సినిమాతో ప్రారంభించారు. తరువాత ఎన్నో సపోర్టింగ్ రోల్స్, నెగెటివ్ పాత్రలు చేశారు. తరువాత ఆయన నిర్మాతగా మారి తన తల్లి పేరిట అంజనా ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి దాని ఆధ్వర్యంలో అనేక చిత్రాలను నిర్మించారు.
ఇక నాగబాబు 108 సినిమాలు చేయగా.. వాటిల్లో ఆయన నిర్మించిన చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో చాలా సినిమాలు కమర్షియల్‌గా హిట్ సాధించాయి. తన సోదరులు చిరంజీవి, పవన్‌లతోనూ ఆయన నిర్మాతగా అనేక సినిమాలు తీశారు. ఇక మార్చి 2019లో నాగబాబు జనసేనలో చేరి నర్సాపూర్ పార్లమెంటరీ నియోజకర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో ఎన్నికల కమిషన్‌కు ఆయన ఎలక్షన్ అఫిడవిట్‌ను సమర్పించారు. దాని ప్రకారం ఆయన, ఆయన భార్య పేరిట మొత్తం కలిపి రూ.41 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. వాటిల్లో రూ.36.73 కోట్ల ఆస్తులు కేవలం విలువైన వాహనాల రూపంలోనే ఉన్నాయి. రూ.4.22 కోట్ల మేర ప్రాపర్టీస్ ఉండగా.. రూ.2.70 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.
ఇక నాగబాబుకు లగ్జరీ కార్లు అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఆయన వద్ద ఆడి 6, ఆడి క్యూ7, బెంజ్ జీఎల్ఈ క్లాస్, ల్యాండ్ రోవర్ వంటి కంపెనీలకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక నాగబాబు ఒక సినిమాలో నటిస్తే ప్రస్తుతం రూ.25 లక్షలు తీసుకుంటున్నారు. అలాగే పలు టీవీ షోల్లోనూ ఈయన చేస్తున్నారు. జబర్దస్త్‌కు జడ్జిగా వ్యవహరించడం ద్వారా ఈయన బాగా పాపులర్ అయ్యారు. అయితే నా పేరు సూర్య పేరిట 2018లో నాగబాబు చివరిసారిగా నిర్మాతగా ఓ మూవీ తీశారు. కానీ ఆ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో ఆయన మరింతగా అప్పుల్లో కూరుకుపోయారు. అయితే త్వరలోనే ఈయన మళ్లీ నిర్మాతగా మారనున్నారని తెలుస్తోంది. తన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ఈయన ఓ మూవీకి సహ నిర్మాతగా వ్యహరిస్తారని టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…