Niharika Konidela : మెగా డాటర్ నిహారిక ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈమె డ్రగ్స్ కేసు వల్ల చాలా రోజులపాటు ఇంటికే పరిమితం అయింది. తరువాత అనూహ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చింది. గతంలో ఈమె పలు కారణాల వల్ల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తాత్కాలికంగా డీయాక్టివేట్ చేసింది. కానీ డ్రగ్స్ కేసు అనంతరం కొన్ని రోజులు అయ్యాక తిరిగి ఇన్‌స్టాలోకి వచ్చింది. ఇక ఈమె తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చేసింది. అలాగే ఎప్పటిలాగే జిమ్‌లో వర్కవుట్స్ కూడా చేస్తోంది.
తన భర్త చైతన్యతో ఈ మధ్యే జోర్డాన్‌కు వెకేషన్‌కు వెళ్లి కూడా వచ్చింది. అయితే నిహారిక ఇది వరకే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పింది. అంటే గతంలో మాదిరిగా వెబ్ సిరీస్‌లు, యాంకర్‌గా షోలు చేస్తుందని స్పష్టత ఇచ్చిందన్నమాట. అందులో భాగంగానే రానా సమర్పణలో వస్తున్న 777 చార్లీ అనే మూవీ కోసం నిహారిక పనిచేస్తోంది. ఇక ఈ మూవీకి ప్రమోషన్ కల్పించడం కోసం నిహారిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ సెషన్ నిర్వహించింది. అందులో భాగంగా తన ఫాలోవర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది.
ఒక నెటిజన్ నువ్వు సింగిలేనా.. అని అడగ్గా.. తన భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నానంటారా.. అని ఎదురు ప్రశ్న వేసింది. ఇక ఇంకో నెటిజన్ నిహారికను ఆమె ఫోన్ నంబర్ కావాలని అడగ్గా.. హుష్ అది టాప్ సీక్రెట్.. బయటకు చెప్పకూడదు.. అని బదులిచ్చింది. ఇలా నిహారిక నెటిజన్ల ప్రశ్నలకు ఫన్నీగా సమాధానాలు చెప్పింది. అయితే నిహారిక త్వరలోనే ఓ ప్రముఖ చానల్‌లో ట్రావెల్ షో నిర్వహిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం త్వరలోనే తేలనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…