Allu Arjun : అల్లు అర్జున్ మొదటి నుంచి వివాద రహితుడు. తన సినిమాలు ఏవో తాను తీసుకుని తన మార్గంలో తాను వెళ్తుంటాడు. ఎవరినీ కించ పరిచేలా మాట్లాడడు. మెగా కుటుంబం నుంచి వచ్చినా అల్లు అర్జున్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ ఎలాగో అల్లు ఫ్యాన్స్ కూడా అలాగే ఏర్పడ్డారు. అయితే ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పలు సంఘటనల కారణంగా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ను విమర్శిస్తున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా అంతే ఘాటుగా ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఇటీవలే విజయవాడలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆలిండియా సంఘం ఆధ్వర్యంలో ఓ మీటింగ్ నిర్వహించారు. అందులో మెగా ఫ్యాన్స్ హాజరై పవన్ భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై చర్చించారు. పవన్‌ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే సీఎంగా చూడాలని వారు తీర్మానించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా స్టేజిపై ఏర్పాటు చేసిన ఫొటోలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌ల ఫొటోలు ఉన్నాయి. కానీ బన్నీ ఫొటో లేదు. దీంతో అల్లు అర్జున్‌కు, మెగా కాంపౌండ్‌కు మధ్య దూరం పెరిగిందనే వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. ఇక ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య గొడవలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా ఈ వివాదంలోకి నందమూరి ఫ్యాన్స్ ఎంటర్ అయ్యారు.
అల్లు అర్జున్ అంటే నందమూరి ఫ్యాన్స్‌కు ఇప్పటికే ఎంతో గౌరవం ఏర్పడింది. అఖండ ఈవెంట్‌లో కావచ్చు.. అంతకు ముందు టెలికాస్ట్ అయిన అన్‌స్టాపబుల్ షో కావచ్చు.. అల్లు అర్జున్ నందమూరి ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యాడు. దీంతో బన్నీని నందమూరి ఫ్యాన్స్ తమ సొంత మనిషిలా భావిస్తూ వస్తున్నారు. అలాగే బన్నీ పుష్ప సినిమాకు కూడా వారు సపోర్ట్‌గా ఉన్నారు. ఇలా ప్రతి సందర్భంలోనూ బన్నీకి నందమూరి ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా తాజాగా మెగా ఫ్యాన్స్‌కు, బన్నీ ఫ్యాన్స్‌కు మధ్య జరుగుతున్న గొడవలో నందమూరి ఫ్యాన్స్ ఎంటరయ్యారు. వారు బన్నీ ఫ్యాన్స్‌కు సపోర్ట్‌గా నిలిచారు. దీంతో ఫ్యాన్స్ మధ్య వార్ ముదిరి పాకాన పడుతోంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ ఒకవైపు.. మెగా ఫ్యాన్స్ ఒకవైపు చేరి ట్విట్టర్‌లో, ఇతర సోషల్ మీడియా వేదికలపై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
ఇక బన్నీని తమ సొంత మనిషిలా భావిస్తున్న నందమూరి ఫ్యాన్స్.. ఇప్పుడు ఆయనకు ఒక ట్యాగ్ కూడా తగిలించారు. బన్నీ ఇప్పుడు నందమూరి అల్లు అర్జున్ అని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి వైరల్ అవుతోంది. ఇక ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…