Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, సమంతలు హీరో హీరోయిన్లుగా ఖుషి అనే చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం విదితమే. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో వచ్చిన పవన్ కల్యాణ్ ఖుషి టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్, సమంత ఇద్దరి ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. దీంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది. అయితే తాజాగా ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత, విజయ్ ఖుషి సినిమా షూటింగ్ ముగించుకుని వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిందని.. వారికి తీవ్ర గాయాలు అయ్యాయని.. దీంతో వారు హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారని.. వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.
సమంత, విజయ్ దేవరకొండ కారులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు.. అన్న వార్తలపై ఖుషి దర్శకుడు శివ నిర్వాణ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. అదంతా ఫేక్ న్యూస్ అని.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విజయ్ ముంబైకి చేరుకోగా.. సమంత హైదరాబాద్‌కు వచ్చిందని.. కనుక ఆ వార్తల్లో నిజం లేదని.. వాటిని నమ్మకూడదని.. అన్నారు.
ఇక విజయ్ దేవరకొండ మరోవైపు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జేజీఎం (జనగణమణ) అనే చిత్ర షూటింగ్ కోసం ముంబైకి వెళ్లగా.. సమంత యథావిధిగా హైదరాబాద్‌కు వచ్చేసింది. ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యశోద చిత్ర షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేయనున్నారు. అలాగే సమంత నటిస్తున్న శాకుంతలం అనే మూవీ కూడా ఈ ఏడాదే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…