Nandivardhanam Plant : మనం ఎన్నో రకాల పూల మొక్కలను పెరట్లో పెంచుకుంటాం. కొన్ని రకాల మొక్కలు పూలు పూయడమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయని చెప్పవచ్చు. ఇలా ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కల్లో 5 రెక్కల నందివర్ధనం మొక్క కూడా ఒకటి. దీనినే గరుడవర్ధనం అని కూడా అంటారు. ఈ మొక్క పూలు చాలా అందంగా ఉంటాయి. ఈ పూలను ఎక్కువగా దైవరాధనకి ఉపయోగిస్తాం. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.
ఈ నందివర్ధనం పూలు ఎక్కువగా వర్షాకాలం మరియు వేసవి కాలంలో పూస్తాయి. శీతాకాలంలో ఈ పువ్వులు చాలా తక్కువగా పూస్తాయి. వర్ష మరియు శీతాకాలంలో చాలా మంది కఫ, పైత్య దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నందివర్ధనం కఫాన్ని, పైత్యాన్ని, కడుపులో మంటలను, రక్తదోషాలను, జ్వరాన్ని, వాంతులను, మగతను వంటి విష ప్రభావాలను తగ్గిస్తుంది. నందివర్ధనం మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉండటం వలన ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని గాయాలకు పై పూతగా రాస్తే తొందరగా నయం అవుతాయి.
అంతేకాకుండా నందివర్ధనం పూల రసంలో కర్పూరం వేసి బాగా కలిపి ఆ మిశ్రమం నుంచి ఒక చుక్కను కంటిలో వేసుకుంటే కంటి మంటలు, కన్ను ఎర్రబడటం వంటివి తగ్గిస్తుంది. అలాగే తాజా నందివర్ధనం పువ్వులను కళ్లపై పెట్టుకుంటే కంటి ఎరుపుదనం తగ్గించి కంటికి చల్లదనాన్ని కలిగిస్తుంది. నందివర్ధనం మొక్క ఆకులు, కాండం, వేళ్ళు, పువ్వులు అన్నింటిలోనూ ఔషద గుణాలు అధికంగా ఉంటాయి.
తలనొప్పిగా ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని నుదురుకి రాస్తే తొందరగా తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ నందివర్ధనం పువ్వులను రాత్రంతా నీటిలో వేసి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రాగితే కిడ్నీ సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్ లు తగ్గుముఖం పడతాయి. ఇలా నందివర్ధనం మొక్కతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నయి కనుక దీన్ని అందరూ ఇంట్లో పెంచుకోవాలి. దీంతో ఎన్నో లాభాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…