Viral Video : సాధారణంగా పెళ్లిళ్ల వంటి శుభ కార్యాల్లో ఎంతో సందడిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉంటారు. వేడుకల్లో సందడి చేస్తుంటారు. దూరపు బంధువులు కలుస్తారు కనుక ఆత్మీయతలు, జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పెళ్లి అయ్యే వరకు ఎంతో సంతోషంగా గడుపుతారు. అయితే కొన్ని సార్లు పెళ్లి వేడుకల్లో కొందరు ఉత్సాహంగా డ్యాన్స్‌లు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ అంతటా కొనసాగుతోంది. ఇక ఇంకా చెప్పాలంటే.. పెళ్లి కుమారుడు, కుమార్తె ఇద్దరూ డ్యాన్స్‌లు వేస్తూ అలరిస్తుంటారు. ఇలా అనేక పెళ్లిళ్లలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా కూడా ఒక వివాహ వేడుకలో ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఓ వివాహ వేడుకలో పెళ్లి జరుగుతుండగా స్టేజిపై పెళ్లి కుమార్తె డ్యాన్స్ చేసింది. హిందీలో వచ్చిన అత్రంగీ రే అనే మూవీలోని చక చక అనే పాటకు డ్యాన్స్ చేసి అదుర్స్ అనిపించుకుంది. ఆమె అలా డ్యాన్స్ చేస్తుండగా.. ఎంతో మంది ఆసక్తిగా వీక్షించారు. చుట్టూ ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. పెళ్లి కుమార్తె అంత కోలాహలంగా.. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండడం చూసి అందరూ మంత్ర ముగ్ధులు అయ్యారు.

ఇక వధువు అలా డ్యాన్స్ చేస్తూ ఉండగా.. వెనుకనే నిలుచుని ఉన్న వరుడు మాత్రం చేష్టలుడిగి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె అంతలా డ్యాన్స్ చేస్తుంటే.. కనీసం నువ్వు ఒక్క స్టెప్ కూడా వేయలేదు.. ఎందుకు.. అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అందనూ ఈ వీడియోను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
View this post on Instagram