Dj Tillu : సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టిలు హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇందులోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రధానంగా డీజే టిల్లు టైటిల్ సాంగ్ అయితే అదిరిపోయింది. ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక పెళ్లి ఊరేగింపు సమయాల్లో ఇప్పటికే చాలా మంది ఈ పాటను ప్లే చేశారు. అందుకు అదిరిపోయే రీతిలో డ్యాన్స్‌లను కూడా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పెళ్లి ఊరేగింపు సమయంలో ఇదే పాటను మళ్లీ ప్లే చేశారు. దీంతో ఊరేగింపులో పాల్గొన్న వధువు, వరుడు ఇద్దరూ ఈ పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.
ఓ పెళ్లి ఊరేగింపులో డీజే టిల్లు టైటిల్ సాంగ్‌ను ప్లే చేశారు. అందులో వధువు, వరుడు ఇద్దరూ కారులోనే ఉండి ఈ పాటకు స్టెప్పులేశారు. ఈ క్రమంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వారిద్దరి డ్యాన్స్‌ను చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఈ పాటకు ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు సైతం డ్యాన్స్‌లు చేశారు. టీవీ షోల్లోనూ ఈ పాట అదరగొడుతోంది. ప్రేక్షకులు ఈ పాటను ఎంతో ఆసక్తిగా వీక్షించడమే కాదు.. అందుకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్నారు కూడా.
కాగా డీజే టిల్లు సినిమాకు శ్రీచరణ్ సంగీతం అందించారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. ఫిబ్రవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అలాగే ఓటీటీలోనూ భారీ వ్యూస్‌ను సాధించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…