Brahmanandam : హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కామెడీకి పరవశించని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. దాదాపు మూడు తరాల ప్రేక్షకులకు తనదైన హావభావాలతో చక్కిలిగింతలు పెట్టారు. నేటికీ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుక్కున మెరుస్తూ థియేటర్లను నవ్వులతో ముంచెత్తుతున్న బ్రహ్మి గతంలో మాదిరిగా సినిమాలు చేయడం లేదు. అప్పట్లో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు. స్టార్ హీరోల సినిమా అయినా బ్రహ్మనందం ఉంటేనే ఆ సినిమాకి మంచి గుర్తింపు దక్కేది. కొంత కాలంగా ఆయన సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. దీనిపై అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి.

భారీగా రెమ్యునరేషన్ పెంచడం ఒక కారణం అని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం గుండె సర్జరీ వలన ఇండస్ట్రీకి దూరమయ్యాడు అని అంటున్నారు. ఒకప్పుడు బ్రహ్మానందం రూ.5లక్షల రూపాయలని రోజుకి రెమ్యునరేషన్‌గా తీసుకున్నా వెతుక్కుంటూ ఆఫర్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు అసలు బ్రహ్మీ సినిమాలలో కనిపించడమే తక్కువైంది. పంచతంత్రం అనే సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషిస్తుండగా,ఈ సినిమా కోసం ఆయన అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఆయన మరిన్ని చిత్రాలతో అలరించాలని ప్రార్థిస్తున్నారు.
లెక్చరర్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా ఎదిగారు బ్రహ్మానందం. అతి తక్కువ టైంలో ఏకంగా వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డులోకి ఎక్కారాయన. మహమ్మారి స్ప్రెడ్ అవుతున్న సమయంలో బ్రహ్మీ సినిమాలు పూర్తిగా తగ్గించేశారు, ఇంట్లోనే ఉంటున్నారు. కొడుకు, మనవళ్ళతో కలిసి కాలాన్ని గడుపుతున్నారు. బ్రహ్మానందంకి సినిమాలతోపాటు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయంలో ఎక్కువగా డ్రాయింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఆయన గీసిన డ్రాయింగ్స్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాయి.