Hritik Roshan : ప్రస్తుతం బాలీవుడ్ లో హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ (#Boycott) ట్రెండ్ నడుస్తోంది. కొంతమంది వ్యక్తులు ఒక వర్గానికి చెందిన హీరోలు, నటీ నటులను లక్ష్యంగా చేసుకొని వారి సినిమాలను నిషేధించాలని వాటిని చూడకూడదని సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే గతంలో సదరు హీరోలు, నటీ నటులు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, సినీ వారసత్వాన్ని పోషిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు . ఇక నిన్నటి వరకు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా ఈ బాయ్ కాట్ ట్రెండ్ కి బాధితుడిగా ఉన్నారు.
అయితే అమీర్ తాజాగా నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాకి కూడా విడుదలకు ముందు నుండే బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. దీంతో ఈ సినిమా అమీర్ ఖాన్ కెరీర్ లోనే బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ ప్రారంభ వసూళ్లు దక్కించుకున్న చిత్రంగా నిలిచింది. ఇక ఈ బాయ్ కాట్ ప్రభావం అమీర్ మూవీపై కాస్త ఎక్కువగానే పని చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక దారుణంగా పరాజయం పాలైంది.
ఇక తాజాగా బాలీవుడ్ హ్యండ్సమ్ హీరో హృతిక్ రోషన్ కూడా ఈ బాయ్ కాట్ బాధితుడు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈయన సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే స్టార్. ఆయన చిత్రాలను నిషేధించాల్సిన అవసరం కూడా ఎవరికీ రాదు. కానీ రెండు రోజుల క్రితం ఆయన తాను లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని చూడడం జరిగిందని, అది చాలా బాగుందని.. అందరూ తప్పక ఆ సినిమాను చూడాలని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోరారు.
అయితే ఆయన ఇలా లాల్ సింగ్ చడ్డా సినిమాని పొగడడం సోషల్ మీడియాలో కొందరికి కోపం రావడానికి కారణం అయ్యింది. దీంతో వారు ప్రస్తుతం హృతిక్ నటిస్తున్న విక్రమ్ వేదా మూవీని కూడా నిషేధించాలని డిసైడైపోయారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో బాయ్ కాట్ విక్రమ్ వేదా హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఆర్.మాధవన్, విజయ్ సేతుపతిల కలయికలో రూపొంది 2017లో విడుదలై తమిళంలో విజయవంతమైన చిత్రం విక్రమ్ వేదా.
తరువాత తెలుగు భాషలోకి కూడా అనువాదం అయ్యి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పుష్కర్ – గాయత్రిల ద్వయం ఈ సినిమాకి దర్శకులు. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీ రీమేక్ కి కూడా వీరిద్దరే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…