Vijay Devarakonda : నటుడు విజయ్ దేవరకొండ నడుచుకునే తీరే వేరు. సినిమా ఇండస్ట్రీలో ఆయన స్టైల్ ని ఏ ఇతర హీరోతోనూ పోల్చలేం అనేది అక్షర సత్యం. డొంక తిరుగుడు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. అయితే తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఇదే విషయాన్ని ఆయన మళ్లీ నిరూపించారు. విజయ్ లేటెస్ట్ మూవీ లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియా ప్రతినిధులతో సమావేశం జరిగింది. అయితే ఈ మీటింగ్ లో విజయ్ రెండు కాళ్లను లేపి తన ముందు ఉన్న టేబుల్ పై పెట్టి కూర్చోవడం జరిగింది. మామూలుగా అయితే సమావేశాల్లో ఇలా చేయడం అనేది అసాధారణం. ఇంకా తప్పుడు చర్యగా భావిస్తారు. ఒక విధంగా అమర్యాదగా కూడా అనిపిస్తుంది. కానీ విజయ్ దేవరకొండ ఏమాత్రం సంకోచించకుండా ఆ పని చేసేశాడు.
ఇక విజయ్ ఇలా చేయడానికి కారణం మాత్రం వేరే ఉంది. ఆ సమావేశంలో ఒక విలేకరి విజయ్ ని ఉద్దేశించి ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిన తరువాత తనకి ప్రశ్నలు అడగడానికి సంకోచంగా, భయంగా ఉందని అన్నారు. తనకి గతంలో విజయ్ తో పరిచయం ఉన్నప్పటికీ తను ఇదివరకటిలా విజయ్ ని ప్రశ్నలు వేయలేనని తన మనసులోని మాటను చెప్పాడు. దీనికి సమాధానంగా విజయ్ ఆ విలేకరితో.. టెన్షన్ పడకుండా కంఫర్టబుల్ గా ఉండమని అన్నాడు.
అవసరమైతే కాళ్లు ఇలా పెట్టుకొని కూర్చోమని సూచిస్తూ అలాగే టేబుల్ పై తన కాళ్లు పెట్టి చూపించారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి సంఘటనలతో విజయ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తరచూ తనని తను అందరికంటే భిన్నమైన వ్యక్తిగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…