Bimbisara : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బింబిసార. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా బింబిసార నిలిచింది. కళ్యాణ్ రామ్ సహజ నటనకు.. డైరెక్టర్ వశిష్ట స్క్రీన్ ప్లే ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. వరుస ఫ్లాప్స్ తో కేరీర్ ను నెట్టుకొస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
తొలిసారిగా చక్రవర్తి పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. అయితే తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యింది బింబిసార. ఓటీటీ రిలీజ్ కు ముహూర్తంగా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇప్పటికే డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం జీ5 (Zee5)లో అక్టోబర్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

దీంతో నందమూరి అభిమానులు, ఓటీటీ ఆడియెన్స్ ఖుషీ అవుతున్నారు. రూ.40 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మొదటి భాగం విజయవంతం అవడంతో రెండో భాగాన్ని మరింత గ్రాండ్ గా నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే బింబిసార 2 ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే బింబిసార 2లోనైనా.. బింబిసారా 3లోనైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను దింపుతానని ఇప్పటికే కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేయడంతో వచ్చే సీక్వెల్స్ పై భారీ అంచనాలున్నాయి. నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.