నందమూరి కల్యాణ్ రామ్ తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం.. బింబిసార. ఇందులో కల్యాణ్ రామ్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఆయన పక్కన క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ లు నటించారు. క్రీస్తు పూర్వం 500వ సంవత్సరానికి చెందిన బింబిసారుడి కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఈ మూవీ థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
అయితే ప్రస్తుతం తరుణంలో రిలీజ్ అవుతున్న సినిమాలు నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక ఫ్లాప్ అవుతున్న మూవీలు 3 వారాల్లోనే ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బింబిసార మూవీ కూడా ఓటీటీలోకి రానుంది. ఈ మూవీకి గాను డిజిటల్ హక్కులను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. దీంతో ఇదే యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
ఇక బింబిసార మూవీ ప్రదర్శనను బట్టి మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనే విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. సినిమాకు హిట్ టాక్ వస్తే గనక 10 వారాల తరువాతే ఓటీటీలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అదే ఫ్లాప్ అయితే నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక బింబిసార మూవీకి ఇప్పటి వరకు అయితే పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. సోమవారం కూడా ముగిస్తేనే కానీ.. సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏమిటనేది తెలియదు. కనుక అప్పటి వరకు వేచి చూడాల్సిందే.