బింబిసార మూవీ రివ్యూ..!

నందమూరి కల్యాణ్‌ రామ్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ.. బింబిసార. ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కల్యాణ్‌ రామ్‌ ద్విపాత్రాభినయంలో నటించారు. ఆయన సరసన క్యాథరిన్‌ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీ ఎలా ఉంది ? కథ ఏమిటి ? ప్రేక్షకులను ఆకట్టుకుందా.. లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కథ..

ఈ కథ మొత్తం క్రీస్తుశకం 5వ శతాబ్దంలో జరిగినట్లు చెప్పబడింది. అలాగే ప్రస్తుతం కాలంలోనూ కొంత కథ నడుస్తుంది. ఇక బింబిసారుడు (కల్యాణ్‌ రామ్‌) త్రిగర్తలకు రాజు. అత్యంత క్రూరుడిగా, దయలేని రాజుగా పాలిస్తుంటాడు. అతనికి కవల సోదరుడు ఉంటాడు. పేరు దేవదత్తుడు. ఇతను చాలా జాలి, దయ గుణాలు కలిగిన వాడు. అయితే ఇద్దరు సోదరుల మధ్య కలహాలు వస్తాయి. ఈ క్రమంలోనే కథ ప్రస్తుత కాలానికి మారుతుంది. అయితే వారి మధ్య ఎందుకు గొడవలు వస్తాయి ? ఈ కాలంలో బింబిసారుడు ఎలా అడ్జస్ట్‌ అవుతాడు ? చివరకు ఏమవుతుంది ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ..

బింబిసార మూవీ నిజంగా కల్యాణ్‌ రామ్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పవచ్చు. ఈయన బాడీ లాంగ్వేజ్‌, భారీ డైలాగ్స్‌ అదిరిపోయాయి. ఎలాంటి క్యారెక్టర్‌ లో అయినా సరే కల్యాణ్‌ రామ్‌ జీవించగలడు. అలాగే ఈ మూవీలోనూ అదిరిపోయేలా యాక్టింగ్‌ చేశాడు. ఇక ఆయన పక్కన నటించిన క్యాథరిన్‌ ట్రెసా, సంయుక్త మీనన్‌ లు కూడా డీసెంట్‌గానే నటించారు. తమ పాత్రల పరిధుల మేరకు ఆకట్టుకున్నారు.

ఈ మూవీలో తనికెళ్ల భరణి, ప్రకాష్‌ రాజ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌లు కూడా యాక్ట్‌ చేశారు. వీరు కూడా ఫర్వాలేదనిపించారు. ఇక దర్శకుడు వశిష్టకు ఇది తొలి మూవీ. ఈ మూవీ ద్వారానే ఆయన టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అద్భుతమైన కథను ఎంచుకోవడంలో ఈయన సక్సెస్‌ సాధించరనే చెప్పవచ్చు. అయితే ప్రముఖ నటీనటులను తీసుకున్నా.. వారి పాత్రలను సాధారణం చేశారు. ఆ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేశారు. అందువల్ల సాధారణ నటీనటులు కూడా ఆ పాత్రలకు సరిపోతారని చెప్పవచ్చు. అయినప్పటికీ కథలో కొత్తదనం కనిపిస్తుంది. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందువల్ల సినిమా ఆద్యంతం ఆసక్తిగానే సాగుతుంది.

ఇక ఎంఎం కీరవాణి అందించిన సంగీతం బాగుంది. సంగీతంలో ఆయనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. బాహుబలి, ఆర్ఆర్‌ఆర్‌ వంటి చిత్రాల మాదిరిగానే ఈ మూవీ కూడా ఉంటుంది కనుక కీరవాణి మ్యూజిక్‌ కు న్యాయం చేశారు. అలాగే ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్‌ ఆకట్టుకుంటాయి.

చివరగా చెప్పాలంటే.. సినిమాలోని కథ, అందులోని కొత్తదనం, స్క్రీన్‌ ప్లే, కల్యాణ్‌ రామ్‌ యాక్టింగ్‌.. ఈ మూవీకి ప్లస్‌ పాయింట్స్‌ అని చెప్పవచ్చు. అలాగే విలన్‌ బలహీనంగా ఉండడం, ప్యాచ్‌ లుగా అనిపించడం, ఇతర పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం.. వంటివి మైనస్‌ అని చెప్పవచ్చు. అయినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే ఈ మూవీని ప్రేక్షకులు బాగానే ఎంజాయ్‌ చేస్తారు. కొత్తదనం కోరుకునేవారితోపాటు ప్రేక్షకులు అందరూ ఈ మూవీని ఒక్కసారి చూసి ఎంజాయ్‌ చేయవచ్చు.

Share
IDL Desk

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM