Bimbisara 1st Day Collections : నందమూరి కల్యాణ్ రామ్ స్వయంగా నిర్మించి నటించిన చిత్రం.. బింబిసార. తన ఎన్‌టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ ఈ మూవీని నిర్మించారు. సుమారుగా రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీకి తొలి రోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శుక్రవారం ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చాలా రోజుల తరువాత కల్యాణ్ రామ్ మూవీకి ఇంతటి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ కల్యాణ్ రామ్ కు మాత్రమే కాకుండా.. టాలీవుడ్ ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్లకు సైతం ఊపిరి పీల్చుకునేలా చేసిందని చెప్పవచ్చు.
ఇక బింబిసార మూవీకి తొలి రోజు తెలంగాణలో రూ.2.12 కోట్ల షేర్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం రూ.6 కోట్ల షేర్‌ను ఈ మూవీ సాధించింది. దీంతో బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లేనని అంటున్నారు. ఈ మూవీ ఇంకో నాలుగు రోజులు ఇలాగే నడిస్తే పెట్టిన బడ్జెట్ మొత్తం వస్తుందని.. ఆ తరువాత వచ్చేదంతా లాభమే అని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫీట్‌ను మూవీ అవలీలగా సాధించగలదు. దీంతో కల్యాణ్ రామ్ దశ తిరిగిపోయిందని.. ఆయనకు లక్ మామూలుగా లేదని అంటున్నారు.

చాలా రోజుల తరువాత కల్యాణ్ రామ్ హిట్ సాధించగా.. అసలే డీలా పడిపోయి ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమకు బింబిసార మూవీ ఊపిరి పోసిందని చెప్పవచ్చు. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాలంలో ప్రయాణించడం (టైమ్ ట్రావెల్) అనే కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ కావడంతో సహజంగానే ఆసక్తి నెలకొంటుంది. గతంలో ఆదిత్య 369 మూవీని కూడా ఇదే కాన్సెప్ట్‌తో తీశారు. ఇప్పుడదే అంశంతో కల్యాణ్ రామ్ ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక మొత్తంగా ఈ మూవీ చివరకు ఎంత వసూలు చేస్తుందో చూడాలి.