బిగ్ బాస్ టెలివిజన్ రియాలీటి షో 2017 సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. మొదటి సీజన్ 70 రోజుల పాటు జరగగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో వరుస సీజన్‌లతో వచ్చారు మేకర్స్. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రోమో విడుదలైంది.
సీజన్ 3 నుండి అక్కినేని నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 6కి కూడా ఆయనే హోస్ట్‌గా కొనసాగనున్నారు. ఈ సీజన్ బిగ్ బాస్ లోగోలో ఉన్న కన్ను మరింత ఆకర్షణీయంగా ఉంది. స్టార్ మాలో త్వరలో సీజన్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభమవుతుందని.. స్టార్ మా కొత్త బిగ్ బాస్ లోగోకు క్యాప్షన్ ఇచ్చింది.
అయితే.. కింగ్ నాగార్జున ప్రతి సంవత్సరం తన సినిమాల కంటే బిగ్ బాస్ తోనే ఎక్కువ ఆదరణ పొందుతున్నారు. మీరు ఒకటి గమనించారా.. ప్రతి సంవత్సరం తన సినిమా విడుదల దగ్గర పడుతున్నప్పుడు, బిగ్ బాస్ షో కూడా వస్తోంది. ఇది నిజానికి సీనియర్ హీరో తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి సహాయపడుతోంది. ఈసారి ఆయన ది ఘోస్ట్ సినిమాతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ 6 టెలికాస్ట్ అవడానికి సిద్ధంగా ఉంది.
ఈసారి నాగార్జున ప్రోమోలో ప్రేక్షకుల మానసిక స్థితిని సరిగ్గా వివరించారు. పెళ్లి తర్వాత వధువును పంపడానికి కుటుంబం మొత్తం నిరాకరిస్తుంది, కానీ బిగ్ బాస్ సంగీతం విన్న తర్వాత, వారు ఆమెను ఒంటరిగా వేదికలో వదిలేసి వెళ్తారు.
లైఫ్ లో ఏ మూమెంట్ అయినా.. బిగ్ బాస్ తర్వాతే.. అంటూ నాగార్జున దానిని సారాంశంగా చెప్పారు. చాలామంది ప్రేక్షకులు కూడా అలాగే ఉన్నారు. అందుకే బిగ్ బాస్ రికార్డ్ స్థాయిలో టీఆర్పీ ని సొంతం చేసుకుంటోంది. ఇప్పుడు ఈ షో ప్రోమో విడుదలవడంతో అంతా ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…