Bigg Boss Telugu 6 : బుల్లితెరపై సందడి చేసేందుకు బిగ్‌బాస్ రెడీ అవుతున్నారు. తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ రియాల్టీ షో ఆరో సీజన్ సెప్టెంబర్ 4న ప్రారంభం కానుంది. తెలుగు బిగ్ బాస్ షోకి కింగ్ నాగార్జున పర్మనంట్ హోస్ట్ గా మారిపోయారు. తొలి సీజన్ కి ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అవుతుండగా.. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ హైదరాబాద్ చేరుకున్నారు.
ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. చివరి నిమిషం వరకూ సెలెక్ట్ చేసిన 25 మంది లిస్ట్‌లో ఫైనల్ అయ్యే వాళ్ల వివరాలను సీక్రెట్‌గానే ఉంచగా.. లీకైన సమాచారం ప్రకారం 19 మంది కంటెస్టెంట్స్ వివరాలు బయటకు వచ్చాయి. అందులో ఆర్య మూవీలో అ అంటే అమలాపురం అంటూ ఐటమ్ సాంగ్‌తో ఊపేసిన అభినయ శ్రీ లిస్ట్‌లో ఉండటం విశేషం. ఈమెతోపాటు.. ఓ కామన్ మేన్ కూడా ఉన్నారు. ఆ 19 మంది కంటెస్టెంట్స్ లిస్ట్‌తో పాటు వెయిటింగ్‌లో ఉన్న మరికొంతమంది లిస్ట్ చూద్దాం.
ఇస్మార్ట్ అంజలి, యాంకర్ నేహా చౌదరి, గలాట్టా గీతు-గీతు రాయల్, వాసంతీ కృష్ణన్, సుదీప పింకీ, కీర్తి భట్, జబర్దస్త్ ఫైమా, అభినయశ్రీ, సీరియల్ నటి శ్రీ సత్య, ఇనయా సుల్తానా, బాలాదిత్య, యూట్యూబర్ ఆది రెడ్డి, నటుడు అర్జున్ కళ్యాణ్, మోడల్ రాజశేఖర్, జబర్దస్త్ చలాకీ చంటి, నటుడు శ్రీహన్, గాయకుడు రేవంత్, RJ సూర్య తదితరులు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే షో యొక్క మొదటి రోజు మాత్రమే పోటీదారుల అధికారిక జాబితా బయటకు వస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సారి బిగ్‌బాస్ హౌస్ ని గత సీజన్లకు భిన్నంగా, మరింత అందంగా ముస్తాబు చేశారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గింప్స్‌లో ఇంటిని చూపించారు. అంతేకాదు.. అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంట్రీని, వారి ఫెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్‌ని చూపించారు. అయితే ప్రతి సీజన్ లో అవే టాస్కులు, గేమ్స్ రిపీట్ అవుతున్నాయి. కనీసం సీజన్ 6లో అయినా కాస్త వైవిధ్యం చూపిస్తారేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…