Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ. ఈ పేరులో ఏదో తెలీని ఎనర్జీ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగిన వారిలో రవితేజ ఒకరు. ఒకప్పుడు చిన్నాచితకా వేషాలు వేసుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా మారాడు. రవితేజకు హీరోగా బ్రేక్ ఇచ్చింది మాత్రం పూరీ జగన్నాథ్ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ. అయితే గత 4, 5 సంవత్సరాల్లో రవితేజకు పెద్దగా హిట్ పడింది లేదు. గత ఏడాది కరోనా తర్వాత వచ్చిన క్రాక్ సినిమా ఒక్కటే రవితేజ కెరీర్‌ను నిలబెట్టింది. అది కూడా డైరెక్టర్ మలినేని గోపీచంద్ పుణ్యమా అని రవితేజ ఖాతాలో హిట్ పడింది.
క్రాక్ హిట్ అయిందో లేదో రవితేజ వెంటనే తన రెమ్యూనరేషన్ పెంచేశాడు. కథ, కథనం కంటే.. రవితేజ రెమ్యూనరేషన్ పైనే దృష్టి పెడతాడు అనే టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే క్రాక్ తర్వాత వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం రవితేజ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. టాలీవుడ్‌లో తన అందచందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపుతున్న పెళ్లి సందడి ఫేమ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల రవితేజ సరసన నటిస్తోంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్.. టీజర్లలో రవితేజ, శ్రీలీలతో చేసిన రొమాన్స్ చూసిన ప్రేక్షకులు సెటైర్లు వేస్తున్నారు.
50 ఏళ్ళు దాటేసిన ముసలోడికి 20 ఏళ్ల కుర్ర హీరోయిన్ శ్రీలలతో రొమాన్స్ ఏంటి ? ఆ టీజర్ లో రవితేజ ఎక్స్‌ప్రెషన్లు అసలు చూడలేకపోతున్నాంరా బాబోయ్, షుగర్ పేషేంట్ అయిన తాతయ్య స్వీట్ కోసం మనవరాలిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఉంది వీళ్ళ రొమాన్స్ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తన వయసుకు తగ్గ పాత్రలు వేసుకోవాలి కానీ కుర్ర హీరోయిన్లను వెంటపెట్టుకుని ఇంకా ప్రేమ కథలు.. రొమాన్స్ లు అని చేసుకుంటూ పోతే మరో డిజాస్టర్ తప్పేలా లేదు అంటున్నారు నెటిజన్లు. ఏదైనా ధమాకా కూడా ప్లాప్ అయితే రవితేజను టాలీవుడ్ మర్చిపోయేందుకు పెద్ద సమయం పట్టకపోవచ్చు. మరి ఇప్పటికైనా రవితేజ కథ, కథనం, హీరోయిన్ సెలక్షన్ మీద దృష్టి పెడతాడో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…