Bigg Boss Telugu 6 : బుల్లితెరపై అత్యంత సక్సెస్ సాధించిన షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ షోకు గాను ఇప్పటి వరకు 5 సీజన్లు పూర్తయ్యాయి. తొలి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చారు. తరువాత నాని రెండో సీజన్ చేశారు. ఇక 3, 4, 5 సీజన్లకు నాగార్జుననే వచ్చారు. ఈ క్రమంలోనే వచ్చే 6వ సీజన్‌కు కూడా ఇప్పటికే ఈయననే హోస్ట్‌గా ఎంపిక చేశారు. దీంతో ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో నాగార్జున పాల్గొంటున్నారు.
కాగా బిగ్ బాస్ సీజన్ 6కు గాను ప్రమోషనల్ కార్యక్రమాలను ఆగస్టు నెల నుంచి నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 3వ వారంలో కంటెస్టెంట్లను ఎంపిక చేసి క్వారంటైన్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది. తరువాత సెప్టెంబర్ మొదటి వారంలో షో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల ఎంపికతోపాటు ఇంటి నిర్మాణ పనులను ప్రస్తుతం చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే బిగ్ బాస్ ఓటీటీని కూడా నిర్వహించారు. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ చేశారు. కానీ దీనికి ఆదరణ లభించలేదు. ఇందులో టాప్ 5 లో నిలిచిన వారిని బిగ్ బాస్ సీజన్ 6కు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావల్సి ఉంది. అలాగే నాగార్జున ప్రస్తుతం ఘోస్ట్ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆయన షూటింగ్‌ను పూర్తి చేశాక బిగ్ బాస్ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొననున్నారు. ఇక ఆయన ఘోస్ట్ మూవీ అక్టోబర్ 5వ తేదీన దసరా కానుకగా రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…