Naga Chaitanya : ఈ మధ్య కాలంలో సమంత, నాగచైతన్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరు విడిపోయి దాదాపుగా 10 నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ వీరి విడాకుల విషయం చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే సమంత ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని చైతూను భర్త అని పిలిపించుకోవడానికే ఇష్టపడలేదు. మాజీ భర్త అనాలని చెప్పింది. దీంతో ఇద్దరికీ ఏ రేంజ్‌లో గొడవలు అయి ఉంటాయో కదా.. అందుకనే సమంత అలా వ్యవహరించింది.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈమధ్య ఓ హీరోయిన్‌తో చైతూ చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నాడని వార్తలు రాగా.. వారి టీమ్స్ స్పందించి అదేమీ లేదని.. ఆ వార్తలను కొట్టి పారేశారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే హీరోయిన్ చైతూ అపార్ట్‌మెంట్‌లో కనిపించిందట. అది కూడా రాత్రి పూట. దీంతో మళ్లీ అవే వార్తలు తెరపైకి వచ్చాయి.
అర్థరాత్రి సమయంలో ఆ హీరోయిన్ నాగచైతన్య ఇంట్లో ప్రత్యక్షమైందట. ఈ క్రమంలోనే ఆమెను అక్కడ కొందరు చూసినట్లు సమాచారం. అంత రాత్రి పూట ఆమెకు చైతూ అపార్ట్‌మెంట్‌లో ఏం పని.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఆ హీరోయిన్‌తో రిలేషన్ షిప్ లేదన్నావు.. ఇప్పుడేంటి.. అని సమంత ఫ్యాన్స్ చైతూను ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో ఆమె నీ ఇంటికి రావల్సిన అవసరం ఏమొచ్చింది.. అని అడుగుతున్నారు. అయితే ఇవి పుకార్లేనా.. నిజంగానే ఆమె చైతూ అపార్ట్‌మెంట్‌కు రాత్రి పూట వెళ్లిందా.. అన్న విషయం తేలాల్సి ఉంది.
అయితే సమంత, నాగచైతన్యలను కలిపి ఉంచేందుకు కుటుంబ సభ్యులు శతవిధాలా ప్రయత్నించినట్లు తెలిసింది. అయినప్పటికీ ఇద్దరూ వినలేదట. విడిపోయేందుకే నిర్ణయం తీసుకున్నారట. కనుకనే అక్టోబర్ 2న ఇద్దరూ వేర్వేరుగా తమ సోషల్ ఖాతాల్లో పోస్టులు పెట్టారు. తాము విడిపోతున్నట్లు తెలిపారు. దీంతో అందరూ షాకయ్యారు. ఇక సమంతపై ట్రోలింగ్ కూడా ఎక్కువ అయింది. అయినప్పటికీ ఆమె సహనంగా ఉంటూనే వస్తోంది. కానీ ఈ మధ్యే ఒక పోస్టు పెట్టింది. తన సహనాన్ని అంగీకారం అని తీసుకోవద్దని.. తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించింది. అయినప్పటికీ ఆమెపై వస్తున్న ట్రోల్స్ ఆగడం లేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం అనే సినిమాల్లో నటిస్తుండగా.. యశోద వచ్చే నెలలో రిలీజ్ కానుంది. అలాగే నాగచైతన్య నటించిన థాంక్ యూ ఇటీవలే రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అలాగే ఈయన నటించిన లాల్ సింగ్ చడ్డా అనే బాలీవుడ్ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…