Bigg Boss Sarayu : యూట్యూబ్‌లో పాపులర్ అయిన సరయు తరువాత బిగ్ బాస్‌లో పాల్గొని మరింత ఫేమ్‌ను సంపాదించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల ఓ హోటల్ బిజినెస్‌ను కూడా ప్రారంభించింది. అయితే ఆ హోటల్ ప్రమోషన్ కోసం ఆమె తీసిన ఓ పాట వివాదాస్పదం అవుతోంది. అందులో ఆమె అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించిందని ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సరయు తన హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో తలకు గణపతి బప్పా మోరియా బ్యాండ్ ఉంటుందని, దాన్ని ధరించి మద్యం సేవించారని.. దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవిస్తూ హోటల్‌ను దర్శించాలని చెప్పడం కరెక్ట్ కాదని.. ఆరోపిస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సరయు ప్రవర్తించిందని, కనుక ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు అక్కడ కేసు నమోదు చేసి దాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇక ఈ విషయంపై సరయు వివరణ ఇవ్వాల్సి ఉంది.
అయితే సరయు తన 7 ఆర్ట్స్ యూట్యూబ్ చానల్ ద్వారా అనేక షార్ట్ ఫిలిమ్స్ చేసింది. వాటిల్లో ఆమె పచ్చి బూతులు మాట్లాడుతుంటుంది. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ఆమె ప్రవర్తన పట్ల ఎల్లప్పుడూ ఆమెను విమర్శిస్తుంటారు. ఇక తాను గతంలో ఒక వ్యక్తితో సహజీవనం కూడా చేశానని.. కానీ అతని చేతిలో మోసపోయానని.. సరయు గతంలోనే చెప్పింది. దీంతో అప్పట్లో ఆమె చెప్పిన ఈ విషయం సంచలనంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…