Bigg Boss OTT Telugu : బుల్లితెరపై బిగ్ బాస్ షో ప్రారంభానికి మళ్లీ సర్వం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షోను ప్రారంభించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షో ఈనెల 26వ తేదీన ప్రారంభం కానుందని తెలుస్తుండగా.. షో కోసం నిర్వాహకులు కంటెస్టెంట్లను వెదికే పనిలో పడ్డారు. అందులో భాగంగానే పలువురు పాత కంటెస్టెంట్లను కూడా ఈ షోలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి గాను ముమైత్ ఖాన్, తేజస్వి మడివాడ, ప్రిన్స్‌లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరు ఈ షోకు కన్‌ఫాం అయ్యారని సమాచారం. గత బిగ్ బాస్ సీజన్లలో వీరు పాల్గొని హౌస్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో వీరు గనక ఈ షోలో పాల్గొంటే మళ్లీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అంటున్నారు. వీరు హౌస్‌లో మళ్లీ రచ్చ చేస్తారని భావిస్తున్నారు.
ఇక ఈ షోకు గాను నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. మొత్తం 12 వారాల పాటు.. అంటే.. 84 రోజుల పాటు ఈ షో ప్రసారం అవుతుంది. అయితే బిగ్ బాస్ సాధారణ టీవీ షో రోజుకు 1 గంట నుంచి 2 గంటల వరకు ప్రసారం అయ్యేది. కానీ బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో మాత్రం రోజుకు 24 గంటలూ లైవ్‌లో ప్రసారం కానుంది. దీంతో ప్రేక్షకులకు కావల్సినంత వినోదం లభ్యం కానుంది. మరి ఈ షో ఎలా ఉంటుందో చూడాలి.