Bigg Boss OTT Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షోగా బిగ్ బాస్ ఎంతో పేరు సాధించింది. ఈ షోను విమర్శించే వారు ఏ స్థాయిలో ఉన్నారో.. ఫ్యాన్స్ కూడా అంతే స్థాయిలో ఉన్నారు. అందుకనే ఈ షో గురించి ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నా.. రేటింగ్స్ మాత్రం తగ్గలేదు. ఇక ఇటీవలే సీజన్ 5 కూడా ముగిసింది. ఈ క్రమంలోనే సన్నీ ఈ సీజన్‌కు విజేతగా నిలిచాడు. అయితే అభిమానుల కోసం త్వరలోనే బిగ్‌బాస్ ఓటీటీని కూడా ప్రారంభిస్తామని ఇప్పటికే నాగార్జున ప్రకటించారు. ఈ క్రమంలోనే త్వరలో ఈ షో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ ఓటీటీ త్వరలోనే ప్రారంభం అవుతుందని ఇదివరకే ప్రకటించగా.. ఈ షోను ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రసారం చేస్తారని తెలుస్తోంది. అలాగే బిగ్ బాస్ ఓటీటీ కోసం యాంకర్ శివ, వర్షిని, వైష్ణవి, ఢీ విజేత రాజులను కంటెస్టెంట్లుగా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే గత సీజన్ల వరకు బిగ్ బాస్ టీవీలో వచ్చింది కనుక రోజూ 1 గంట మేర మాత్రమే షోను ప్రసారం చేశారు. కానీ ఓటీటీ కాబట్టి 24 గంటలూ లైవ్ చూపించనున్నారు. దీంతో ఈ షోకు మరిన్ని రేటింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 20వ తేదీన ఈ షోను ప్రారంభిస్తారా, లేదా.. అన్నది సస్పెన్స్‌గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…