Bigg Boss Non Stop : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన షో.. బిగ్‌బాస్. ఈ షో ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే మళ్లీ ఈ షో ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబవుతోంది. అయితే ఈసారి టీవీలో మాత్రం ఈ షో రాదు. ఓటీటీలో వస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో బిగ్ బాస్ ఓటీటీ తెలుగును ప్రసారం చేయనున్నారు. ఈ షో రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ షోకు చెందిన తాజా ప్రోమోను నిర్వాహకులు మంగళవారం లాంచ్ చేశారు.

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు తాజా ప్రోమోలో వినూత్నంగా షో గురించి ప్రచారం చేశారు. ఉరిశిక్ష పడిన ఖైదీ చివరి కోరిక కోరగా.. బిగ్ బాస్ చూడాలని ఉందని చెబుతాడు. అయితే ఈ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కనుక అతను చూస్తూనే ఉంటాడు. దీంతో ఉరి శిక్ష నుంచి తప్పించుకుంటాడు. ఇలా ఫన్నీ వేలో బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ప్రోమోను తీశారు. ఇందులో నాగార్జునతోపాటు వెన్నెల కిషోర్, మురళీ శర్మలు కూడా నటించారు.
https://youtu.be/QzcOrRNHZJE
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో ప్రారంభం అయ్యే తేదీని కూడా ఈ ప్రోమోలో చెప్పారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ షో స్ట్రీమ్ అవుతుందని తెలిపారు. అయితే కంటెస్టెంట్ల వివరాలు మాత్రం తెలియలేదు. త్వరలోనే ఆ వివరాలు కూడా తెలుస్తాయి.