Bigg Boss : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమంలో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ అంటేనే ఎవరూ ఊహించనిది. ప్రతి వారం ఎలిమినేషన్ లో ఊహించిన రిజల్ట్స్ వచ్చినా కూడా ఈ సారి సిరి, ప్రియాంక, కాజల్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా రవి పేరు ఫ్రేమ్ లోకి వచ్చింది. రవిది ఫేక్ ఎలిమినేషన్ అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

12వ వారం నామినేషన్స్‌లో యాంకర్ రవితో పాటు.. కాజల్, సిరి, ప్రియాంక, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్.. ఈ ఏడుగురు ఉండగా.. బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇస్తూ యాంకర్ రవిని ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. ఓటింగ్ పరంగా చూసుకుంటే.. యాంకర్ రవి టాప్ 3లో ఉన్నాడు.. లిస్ట్‌లో సిరి, ప్రియాంక, కాజల్‌లు ఉన్నారు. ఏ పోల్ చూసినా రవి ఎలిమినేషన్ అయినట్టు ఎక్కడా లేదు. సిరి-ప్రియాంకలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చనే అని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ రవిని ఎలిమినేట్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు.
తాజాగా యాంకర్ రవి కోసం భార్య నిత్య, కూతురు వియా వచ్చారు. దీంతో రవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రతి రోజూ వియా ఫోటో చూడనిదే నిద్ర లేవని రవి నేరుగా కూతుర్ని చూడటంతో సంతోషంలో మునిగిపోయాడు. ప్రేమగా హత్తుకొని కాసేపు కబుర్లు చెప్పడంతోపాటు సరదాగా ఆడించాడు. రవి కూతురు వియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.