Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం 11వ వారంలోకి అడుగుపెట్టింది. 19 మంది సభ్యులతో మొదలైన ఈ షోలో ఇప్పటికే 10 మంది బయటకు పోగా, ప్రస్తుతం హౌజ్‌లో 9 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వీరి మధ్య ప్రతి టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అయితే గత రెండు, మూడు రోజులుగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుండగా, తాజాగా మరో కొత్త గేమ్ కు తెర తీశారు. అయితే అందులో గెలిచిన వారికి ఎవిక్షన్ పాస్ దక్కుతుందని తెలిపారు.
నిప్పులే శ్వాసగా, గుండెలో ఆశగా.. పేరుతో ఈ టాస్క్ జరగనుండగా, అందులో భాగంగా హౌస్‌లో ఉండే ఫైర్ ఇంజన్‌లో బజర్ మోగగానే ఇద్దరు సభ్యులు వెళ్లి కూర్చోవాలి. వారి ఎదురుగా మంటల్లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఫొటోలు ఉంటాయి. మంటల్లో ఫొటోలున్న సభ్యులు ఫైర్ ఇంజన్‌లో కూర్చున్న కంటెస్టెంట్స్‌ను ఎవిక్షన్ పాస్ కావాలని, అందుకు మంటల నుంచి తమను రక్షించాలని రిక్వెస్ట్ చేయాలి. అందుకు తగిన రీజన్ కూడా చెప్పాలి.
తాజాగా విడుదలైన ప్రోమోని బట్టి చూస్తే అందులో ముందుగా ఫైర్ ఇంజన్‌లో షణ్ను, సిరి స్థానం దక్కించుకున్నారు. వీరికి ఎదురుగా ఉండే మంటల్లో సన్నీ, ప్రియాంక ఫొటోలు వచ్చాయి. సన్నీ తాను ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటున్నానని, మారేందుకు చాలా కృషి చేస్తున్నాను కాబట్టి తనకు ఎవిక్షన్ పాస్ కావాలని రిక్వెస్ట్ చేశాడు.
అలాగే పింకీ.. తాను మానసికంగా బలవంతురాలినని, ఇకపై గేమ్‌లో ముందుకు సాగాలంటే తనకు ఎవిక్షన్ పాస్ కావాలంటూ రిక్వెస్ట్ చేసింది. ఇందులో ఎవరు సేవ్ అయ్యారనేది ఎపిసోడ్‌లో తెలుస్తుంది.
ఇక శ్రీరామ్‌చంద్ర, ఆనీ మాస్టర్ తర్వాతి బజర్‌కి ఫైర్ ఇంజన్‌లో స్థానం దక్కించుకున్నారు. వారికి ఎదురుగా షణ్ను, సిరి ఫొటోలు మంటల్లో ఉన్నాయి. అయితే వీళ్లిద్దరూ తమకు ప్రజలపై నమ్మకం ఉందని, వారు ఓటు వేసి తమను గెలిపించుకుంటారనే నమ్మకం ఉందని, కాబట్టి, తమకు ఎవిక్షన్ పాస్ అక్కర్లేదని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…