Chandrababu Naidu : తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా లైవ్‌లోనే ఏడ్చేశారు. ఆయన అలా ఏడవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి ఆయన వాకౌట్ చేసిన అనంతరం.. తిరిగి ఏపీకి సీఎం అయ్యాకే.. మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని అన్నారు. వెంటనే ఆయన మంగళగిరిలో టీడీపీ ఆఫీస్‌కి చేరుకుని అక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో భాగంగానే ఆయన లైవ్‌లోనే ఏడ్చేశారు.
కాగా ఇటీవల నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైన విషయం విదితమే. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఓటమి పాలైంది. దీంతో అసెంబ్లీలో తనను అధికార పార్టీ వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి జగన్ అనరాని మాటలు అన్నారని, తీవ్ర పదజాలంతో దూషించారని.. చివరకు తన భార్య భువనేశ్వరిని కూడా ఈ విషయంలోకి తీసుకొచ్చారని.. చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆయన ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో భావాలను నియంత్రించుకోలేకపోయారు. లైవ్‌లోనే ఏడ్చేశారు. గతంలో ఆయన ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా వైసీపీపై నిప్పులు చెరిగేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని ఒక నిమిషం పాటు ఏడ్చారు. ఇక ఆయన పక్కన ఉన్న టీడీపీ నేతలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
చంద్రబాబు తరువాత తన దుఃఖాన్ని నియంత్రించుకుని మాట్లాడారు. తన భార్య ఎల్లప్పుడూ రాజకీయాల్లో లేరని అన్నారు. అయినప్పటికీ ఆమె తన ప్రతి విజయం వెనుక ఉన్నారని తెలిపారు. వైసీపీ నేతలు తనను అసభ్య పదజాలంతో దూషించారని.. తీవ్రంగా వేధింపులకు గురి చేశారని.. బాబు అన్నారు.
తనకు అధికారం అంటే ఆసక్తి లేదని.. తాను ఇప్పటికే ఎన్నో చూశానని.. రాష్ట్రానికి తాను రికార్డు స్థాయిలో సీఎంగా ఉన్నానని అన్నారు. తనకు రికార్డులు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలనపై తాను పోరాటం చేస్తానని అన్నారు. ప్రజల కోసం ముందుకు సాగుతానని అన్నారు. తాను రాజకీయాల్లోకి మళ్లీ వస్తానని తెలిపారు.
ఇక ప్రెస్ మీట్ చివర్లో కూడా చంద్రబాబు మళ్లీ ఏడ్చారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానాలు చెప్పకుండానే వెళ్లిపోయారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…