Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రసవత్తరంగా మారుతోంది. బిగ్‌బాస్ ఇంట్లో తొమ్మిదో వారంలో 10 మంది నామినేషన్‌లో ఉన్నారు. కెప్టెన్ షణ్ముఖ్ మినహా.. ఇంటి సభ్యులంతా నామినేషన్‌లోకి వచ్చేశారు. అయితే నామినేషన్ తప్పించుకునేందుకు బిగ్ బాస్ ఓ సర్‌ప్రైజింగ్ టాస్క్ ఇచ్చారు.
ఏ సభ్యుడైతే తమ ఫోటో కాకుండా.. మిగిలిన సభ్యుల ఫోటో ఉన్న బ్యాగులు తీసుకొని గార్డెన్ ఏరియాలోని సేఫ్ జోన్ డోర్‌లోకి ముందుగా వెళతారో వారు సేఫ్ అవుతారు. చివరగా వెళ్లేవారితో పాటు.. వారి చేతిలో ఎవరి బ్యాగు ఉందో ఇద్దరు డేంజర్‌లోకి వెళ్తారు. దీంతోపాటు ఇంటి సభ్యులకు మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు బిగ్‌బాస్.
గతవారం ఓ టాస్క్‌లో విజయం పొందిన యానీ మాస్టర్‌కు బిగ్‌బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ స్పెషల్ పవర్ ద్వారా మానస్‌ని సేవ్ చేసింది. అదృష్టవశాత్తూ ఆమెకు మరో స్పెషల్ పవర్ వచ్చింది. దీనిని నామినేషన్ సమయంలో ఉపయోగించొచ్చు.
ఏదేమైనా ఈ వారం నామినేషన్‌లో ఉండగా.. మానస్, అనీ మాస్టర్ స్పెషల్ పవర్ ద్వారా సేవ్ అయ్యారు. దీంతో ఇప్పుడు నామినేషన్‌లో ఎనిమిది మంది ఉన్నారు. నామినేట్ చేయబడిన పోటీదారులు రవి, శ్రీరామ్, విశ్వ, కాజల్, సన్నీ, సిరి, జెస్సీ, ప్రియాంక సింగ్. ఇదిలా ఉంటే 19 మంది కంటెస్టెంట్స్‌లో 8 మంది సభ్యులు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. వారు సరయు, ఉమా దేవి, లహరి షెరి, నటరాజ్, హమీద, శ్వేతా వర్మ, ప్రియ, లోబో. దీంతో ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.