Bigg Boss 5 : బిగ్ బాస్ కార్యక్రమం అంటేనే పలు ట్విస్ట్‌లతో సాగుతుంటుంది. హౌజ్‌లో ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు.. అనేది చెప్పడం కష్టం. ఇప్పటికే హౌజ్ నుండి ఆరుగురు సభ్యులు ఎలిమినేట్ కాగా, ఈ రోజు ఒకరు ఎలిమినేట్ కానున్నారని అందరు భావించారు. ముందు అనీ మాస్టర్ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు, కానీ తర్వాత ప్రియ అంటూ వార్తలు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అనే వార్తలు వస్తున్నాయి.
తాజాగా రిలీజైన ప్రోమోలో అనీ, ప్రియ తప్ప అందరూ సేవ్ అయినట్లు చూపించారు. ఇద్దరు హౌస్‌మేట్స్‌కు గుడ్‌బై చెప్పమని ఆదేశించారు నాగ్. అనంతరం వారిని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు బాక్సుల్లోకి వెళ్లమనగా ప్రియ, అనీ అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని ఖాళీ బాక్సుల్లోకి వెళ్లారు. లైట్స్ ఆఫ్ అయిన తర్వాత చెక్ చేయగా, రెండు బాక్సులు ఖాళీ అయ్యాయి. దీంతో నాగార్జున ఇద్దరు స్టేజ్‌పైకి వస్తారేమోనంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
గత సీజన్ కన్నా ఈ సీజన్‌లో ఎక్కువ మంది సభ్యులని ఇంట్లోకి ప్రవేశ పెట్టారు. దీంతో డబుల్ ఎలిమినేషన్ ఎప్పుడో ఒకసారి ఉంటుందని అందరూ భావించారు. అదెప్పుడు అనేది అందరికీ సర్‌ప్రైజింగ్‌గానే మారింది. అయితే ఈవారం డబుల్ ఎలిమినేషన్ పక్కా ఉంటుందని కొందరు అంటున్నారు. కాగా.. ఈ వారం కాజల్, సిరి, రవి, అనీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ, లోబో నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో శ్రీరామ్, కాజల్‌ను నాగ్ శనివారం ఎపిసోడ్‌లో సేవ్ చేశారు. సిరి, రవి, అనీ, ప్రియ, జెస్సీ, లోబో డేంజర్ జోన్‌లో ఉండగా, అందరినీ సేవ్ చేసి ప్రియ, అనీలను ఇంటి నుండి బయటకు పంపబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…