Bigg Boss 5 : బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్ 5 ఎంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. వారం వారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చాలా మంది ఈ వారం నామినేషన్‌లలో ఉండడంతో ఈ వారాంతంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ? అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వోటింగ్ జరుగుతున్న విధానం, కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్న తీరు, వారు ఇంట్లో గేమ్ ఆడుతున్న విధానాలను పరిశీలస్తూ ప్రేక్షకులు ఎవరికి వారే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఒక అంచనాకు వస్తున్నారు.
ఇక గత ఎలిమినేషన్లు, ప్రస్తుత ఓటింగ్ విధానం వంటి అంశాలను చూస్తే ఈ వారం ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పవచ్చు. హౌస్‌లో ప్రస్తుతం 11 మంది మాత్రమే ఉన్న నేపథ్యంలో కాంపిటీషన్ మరింత ఎక్కువవుతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆర్‌జే కాజల్ ఈ వారం డేంజర్ జోన్‌లో ఉందని తెలుస్తోంది. ఆమెకు వస్తున్న ఓట్లను బట్టి కాకుండా.. ఆమె ఇంట్లో సభ్యులతో ఎలా ఉంటుంది ? అన్న విషయంపైనే ఆమె డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఇంట్లోని చాలా మంది కంటెస్టెంట్లు వ్యతిరేకిస్తుండడమే ఇందుకు కారణం. దీంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే చాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
ఇక విశ్వ, జెస్సీ ఇద్దరూ కూడా ఈ వారం డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. విశ్వ స్ట్రాంగ్ అయినప్పటికీ అతను ఆడుతున్న గేమ్ ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. దీంతో అది విశ్వకు మైనస్ అవుతుందని అంటున్నారు. అందువల్ల అతను కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
అలాగే మరో కంటెస్టెంట్ అయిన జెస్సీ కూడా ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నాడు. అతని ఆరోగ్యం బాగా లేనందున చాలా వరకు టాస్క్‌లకు దూరంగా ఉన్నాడు. దీంతో ఇది అతనిపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే జెస్సీ కూడా ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…