Bigg Boss 5 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం రోజు రోజుకీ రసవత్తరంగా సాగుతోంది. 19 మంది సభ్యులతో షో మొదలు కాగా, ప్రస్తుతం హౌజ్‌లో 15 మంది మాత్రమే ఉన్నారు. తొలివారం సరయు ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారంలో అత్యధికంగా 9 మంది నామినేషన్స్ లో నిలిచారు. ఇంతవరకూ జరిగిన ఐదు నామినేషన్స్ లోనూ ఒక్కసారి కూడా డేంజర్ జోన్ లోకి వెళ్ళకుండా ఉంది కేవలం శ్వేత వర్మ మాత్రమే.
అయితే ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో షణ్ముఖ్ కి మెజారిటీ మెంబర్స్ (8 మంది) తనను నామినేట్ చేయడంతో షణ్ముఖ్ నిజంగానే తన ప్రతిభను ఈ వారం చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వారం అందరి కన్నా తక్కువ ఓట్స్ విశ్వతో పాటు జెస్సీకి వచ్చినట్టు తెలుస్తోంది. వారి ప్రతిభ ఈ మధ్య సరిగ్గా లేని క్రమంలో ప్రేక్షకులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
చూస్తుంటే ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి విశ్వ లేదా జెస్సీలలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. నామినేషన్స్ లో షణ్ముఖ్ తర్వాత అత్యధికంగా నాలుగేసి నామినేషన్స్ అందుకున్న వారు ఇద్దరున్నారు. వారిలో ఒకరు జెస్సీ కాగా మరొకరు రవి. ఎక్కువ సమయాన్ని షణ్ముఖ్ తో జెస్సీ గడపడం, అన్ బాలెన్సెడ్ గా ఉండటం వల్ల అతన్ని నామినేట్ చేస్తున్నట్టు సభ్యులు చెప్పారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…