Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో ప్రస్తుతం తొమ్మిది మంది ఉన్నారు. దీంతో ఫోకస్ కంటెస్టెంట్స్‌పై బాగా పెరుగుతోంది. ఈ విషయం ముందుగానే గ్రహించిన షణ్ముఖ్.. సిరికి పలు సూచనలు చేశాడు. ఇక కాజల్ తనపై వేసిన నిందలను తలచుకుంటూ ఏడుస్తుంటే అది ఫేక్ అని కొట్టి పారేసింది అనీ మాస్టర్. ఇక ప్రియాంక.. మానస్ గురించి ప్రస్తావిస్తూ.. నేను అతని గేమ్ ఆడుతున్నా అని సిరి ఎలా అంటుంది.. అని బాధపడింది ప్రియాంక.
ఈ వారం బయటకు వెళ్లిపోతానని ఫిక్సైన కాజల్.. తన ఫ్రెండ్స్‌తో జ్ఞాపకాలను కూడబెట్టుకోవాలనుకుంది. మరోపక్క బాగా దిష్టి తగలడం వల్లే దిష్టితాడు తెగిపోయిందని అభిప్రాయపడింది సిరి. దీంతో తన రక్తంతో ఎనిమిది పూసలు పెట్టి దిష్టాతాడుని రవితో షణ్ముఖ్‌కి కట్టించింది సిరి. కావాలని గుచ్చుకున్నావా ? లేదంటే అనుకోకుండా తగిలిందా ? అని షణ్ను అడగ్గా.. అనుకోకుండానే కట్ అయి రక్తం వచ్చిందని చెప్పింది సిరి.
ఇక సిరి.. సన్నీ నామినేషన్ ప్రక్రియను ఇమిటేట్ చేస్తుంటే నవ్వింది. దీనినే డబుల్ ఫేస్ అంటారు అంటూ షణ్ముఖ్ ఫైర్ అయ్యాడు. దీన్నే డబుల్ ఫేస్ అంటారని, నా దగ్గర ఇలా ఉండకు, నన్ను మర్చిపో అని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వున్నా నాకు ఫరఖ్ పడలేదన్నాడు. బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేశాడు. దీంతో సిరి అతడిని ఓదార్చేందుకు ప్రయత్నించింది.
నువ్వే మాటలు అంటావు, మళ్లీ నువ్వే బాధపడాతవేంటని అడిగింది సిరి. దీంతో షణ్ను.. నేను ఏడ్వడం వల్ల నువ్వేం తక్కువైపోవు, నా క్యారెక్టరే తప్పు, వెళ్లిపో అని గట్టిగా అరిచాడు. నాకు దీపు చాలా గుర్తొస్తుంది, ఒంటరిగా అనిపిస్తోంది. తనుంటే బాగుండేది అంటూ ప్రేయసి దీప్తి సునయనను గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నాడు షణ్ను.
తాజా ఎపిసోడ్‌లో సిరి-షణ్ముఖ్ రచ్చ ఓ థ్రిల్లర్ మూవీని గుర్తు చేసింది. నీ ఫ్రెండ్‌షిప్, నువ్వు ఏదీ వద్దని అన్నాడు. నాకు నువ్వు అక్కర్లేదు, వెళ్లిపో అనడంతో సిరి ఏడ్చుకుంటూ బాత్‌రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుని తల గోడకేసి కొట్టుకుంది. దీంతో హడలిపోయిన షణ్ను.. తల బాదుకోకు, డోర్ తీయంటూ వేడుకున్నాడు. అందరూ అక్కడికి చేరుకొని డోర్ తీయమనడంతో సిరి బయటకు వచ్చింది. వెంటనే ఆమెను ఓదార్చాడు షణ్ముఖ్.
బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ‘మీ ఇల్లు బంగారం కాను’ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బజర్ మోగినప్పుడు ముందుగా మైనర్ హ్యాట్‌లను పట్టుకున్నవారికి గోల్డ్ మైన్‌లో నుంచి వీలైనంత ఎక్కువ బంగారం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ టాస్క్ నేడు జరగనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…