Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్‌లు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. తాజాగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో హీరోల టీమ్ నుంచి ఒకరిని టార్గెట్ చేసే ఛాన్స్ విలన్స్‌కు వచ్చింది. దాంతో వారు ప్రియాంకని సెలక్ట్ చేసి ముప్పు తిప్పలు పెట్టారు. ఇక హీరోల టీంకి ఛాన్స్ రావడంతో విలన్ టీం నుండి అనీ మాస్టర్‌ని ఎంపిక చేసుకొని ఆమెను నానా ఇబ్బందులకి గురి చేశారు.
తాజా ఎపిసోడ్‌లో సిరి, షణ్ముఖ్‌ల మధ్య ప్రతిసారీ గొడవ జరుగుతూనే ఉంది. నాతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్‌గా చెప్పమని షణ్నుని అడిగింది సిరి. దానికతడు కెప్టెన్ బ్యాండ్ వెళ్లిపోయాక మాట్లాడతానని బదులిచ్చాడు. ఆ తర్వాత ఎప్పటిలాగే సారీ చెప్పడమే కాక 10 గుంజీలు తీశాడు. అయితే విలన్లు రాక్షసావతారం ఎత్తి ఇల్లంతా చిందరవందర చేశారు. ఇందులో భాగంగా సిరి ఇంట్లో వారి బట్టలన్నీ విసిరిపారేసింది. దీంతో రంగంలోకి దిగిన కెప్టెన్ ఇన్నర్స్ ఎందుకు బయటకు తీశావని ప్రశ్నించాడు.
బట్టల లోపల అవి ఉన్నాయి, ఇప్పుడు తీస్తా అంటున్నా కదా, నా చేతి వేళ్లు నొప్పి వస్తున్నాయి. 2 నిమిషాలు ఆగమని చెప్పింది సిరి. ఆ పని ఇప్పుడే చేసి తీరాలని ఆదేశించాడు. అతడి ఆజ్ఞతో చిర్రెత్తిపోయిన సిరి.. తీయనని తేల్చి చెప్పగా ఇది నీ క్యారెక్టర్.. అని నోరు జారాడు షణ్ను. బట్టలు తీయడానికి, క్యారెక్టర్‌కు సంబంధం లేదని మండిపడుతూనే ఏడ్చేసింది సిరి. ఈ దెబ్బల కన్నా నువ్వనే మాటలే ఎక్కువ బాధగా ఉన్నాయంటూ వెక్కివెక్కి ఏడ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…