Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షోపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగులో ఏమాత్రం అంచనాలు లేకుండానే పరిచయం అయిన ఈ షో ఇక్కడి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్ అవడంతోపాటు నాలుగు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇటీవల ఐదో సీజన్ ప్రారంభం కాగా, ఈ షోకి సంబంధించి వస్తున్న లీకులు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
నామినేషన్స్‌లో ఉన్న వారెవరు, ఎలిమినేట్ అయ్యేది ఎవరు, వరస్ట్ పర్‌ఫార్మర్ ఎవరు, కెప్టెన్ ఎవరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు, ఇలాంటి విషయాలన్నీ నెటిజన్స్‌కి ముందుగానే తెలిసిపోతున్నాయి. అయితే ఇప్పుడు సీజన్ 5 విన్నర్ ఎవరు అనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సీజన్ స్టార్ట్ అయినపుడు విన్నర్ రేసులో చాలా మంది ఉన్నారు. విశ్వ, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్.. ఇలా అందరూ టైటిల్ రేసులో పోటీ పడ్డారు.
కానీ గత కొన్ని వారాలుగా నామినేషన్స్ లోకి వస్తున్న షణ్ముఖ్ ఓటింగ్ చూస్తుంటే ఇతడే ఈ సీజన్ విన్నర్ అవుతాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గేమ్ సరిగ్గా ఆడకుండా ఏదో టైంపాస్ చేస్తున్న షణ్ముఖ్ తన ఫాలోయింగ్‌తోనే నెట్టుకొస్తున్నాడు. టైటిల్ విన్నర్ అతడే అవుతాడని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షణ్ముఖ్ కి రానున్న రోజులలో సన్నీ , మానస్, శ్రీరామ్ టఫ్ ఫైట్ ఇస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…