Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం గత నాలుగు సీజన్లలో ఎంతో అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకొని విశేషమైన టీఆర్‌పీ రేటింగ్స్ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వారం మొత్తం ఈ కార్యక్రమానికి రేటింగ్స్ అత్యంత దారుణంగా పడిపోగా వారాంతరాలలో మాత్రం నాగార్జున రావడం వల్ల ఈ కార్యక్రమానికి రేటింగ్స్ ఫర్వాలేదనిపిస్తున్నాయి. అయితే నాగార్జున స్థాయికి ఈ రేటింగ్స్ గొప్పవి అని చెప్పలేము. ఇలా ఈ కార్యక్రమానికి ఆమాంతం రేటింగ్స్ పడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల మధ్య ఏ మాత్రం పస లేదని చెప్పవచ్చు. అలాగే కాంట్రవర్సీలు క్రియేట్ చేసే వారిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడంతో పూర్తిగా ఈ కార్యక్రమం అభిమానులను నిరాశ పరుస్తోందని చెప్పవచ్చు. వారం రోజులలో ఈ కార్యక్రమానికి కేవలం 2.69 రేటింగ్స్ రాగా వీకెండ్ లో మాత్రం అర్బన్ ఏరియాలో 8.77 రేటింగ్ దక్కితే రూరల్ ప్రాంతంలో 5.70 రేటింగ్ దక్కింది.
ఇలా ఈ కార్యక్రమం రేటింగ్స్ అమాంతం పడిపోవడానికి ఈ షో ప్రసారం అయ్యే టైమింగ్స్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కావడం వల్ల చాలా మంది ఈ కార్యక్రమాన్ని చూడటానికి ఇష్టపడటం లేదు. అలాగే వారాంతాలలో 9 గంటలకు ప్రసారం కావడం వల్ల, నాగార్జున వేదికపై సందడి చేయడం వల్ల ఈ కార్యక్రమాన్ని కొంతవరకు ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. మొత్తం మీద ఈ బిగ్‌బాస్ సీజన్‌కు రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నాయని చెప్పవచ్చు.