Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకీ ప్రియా ప్రవర్తన శృతి మించిపోతుంది. ఈ క్రమంలోనే ఆమె బిగ్ బాస్ హౌస్ లో పిచ్చి పట్టినదానిలాగా ప్రవర్తించడమే కాకుండా ఆమె ఆటతీరు అందరికీ విసుగు తెప్పిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో భాగంగా ఎవరు ఎక్కువగా కోడిగుడ్లను కలెక్ట్ చేస్తే వారు కెప్టెన్సీ అని చెప్పడంతో కంటెస్టెంట్ లు గుడ్ల కోసం పోటీ పడతారు. ఇలా ఉండగా విశ్వకు ఎల్లో ఎగ్ రావడంతో బిగ్ బాస్ విశ్వ, కాజల్ కు ప్రత్యేక టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్ లో విశ్వ గెలవడంతో అతనికి 5 గుడ్లు బోనస్ గా వస్తాయి.
ఇక సన్నీ గుడ్ల పై కన్నేసిన ప్రియా తన బుట్టలో ఉన్న గుడ్లను దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే సన్నీ తనను పక్కకు తోయడంతో తనపై ఫిజికల్ అటాక్ చేస్తున్నాడు అంటూ సన్నీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో సన్నీ మాటలు మర్యాదగా రానివ్వండి అంటూ ప్రియకు వార్నింగ్ ఇస్తాడు.
ఇలా సన్నీ వార్నింగ్ ఇవ్వడంతో ప్రియా తనకు వేలు చూపెడుతూ చెంప పగులుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది. అసలు తనని ఏమనాలో అర్థం కాక ఇలాంటి చేతకాని వాళ్లు అందరూ గేమ్ ఆడటానికి ఎందుకు వస్తారు అంటూ సన్నీ ప్రియపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే హౌస్ లో ప్రియా వ్యవహారం ఎంతో వింతగా ఉంది. ఈమె పిచ్చిపిచ్చిగా మాటిమాటికీ సన్నీకి చెంప పగులుతుంది అనడంతో ప్రేక్షకులు కూడా ఈమె ప్రవర్తనకు విసుగు చెందారు. చివరికి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ జెస్సికి సీక్రెట్ టాస్క్ ఇవ్వడంతో జెస్సీ, సన్నీ మధ్య గొడవ చోటు చేసుకుంటుంది.