Bigg Boss 5 : బిగ్ బాస్ కార్యక్రమానికి గత మూడు సీజన్ల నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే గత రెండు సీజన్లలోహోస్ట్ గా నాగార్జున ఎంతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఈ సీజన్లో మాత్రం ఆయన వ్యవహార శైలి నచ్చక ఎంతో మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హోస్ట్ అంటే హౌస్ సభ్యులు ఎవరు తప్పు చేసినా వారిని ప్రశ్నించే హక్కు ఉండాలి. కానీ నాగార్జున మాత్రం ఆ పని చేయడం లేదు.
ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సిరి, షణ్ముఖ్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని, నిత్యం ఒకరినొకరు అంటిపెట్టుకొని వీరి ముద్దులు, హగ్గులు ఇచ్చుకుంటున్నారని.. వీరి గురించి నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం ఈ విషయం గురించి వీరిద్దరినీ ఎప్పుడూ అడగలేదు.
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి సిరి తల్లి ఎంట్రీ ఇచ్చారు. ఈమె హౌస్ లోకి రాగానే తన కూతురు ఎంతో అద్భుతంగా ఆడుతుందని చెప్పినప్పటికీ, సిరి.. షణ్ముఖ్ ను ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం తనకు నచ్చలేదని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
ఇలా తన కూతురికి కొంతవరకు తల్లి బుద్ధి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంలో ఇదే విషయాన్ని క్యాష్ చేసుకున్న నెటిజన్లు బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున చేయలేని పనిని సిరి తల్లి చేసిందా.. అంటూ నాగార్జునను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను…
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కావాలనుకునే వారి కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. గతంలో ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భయపడేవారు. కానీ…
ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలు మీరు జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే ఈ జాబ్స్ మీకోసమే అని చెప్పవచ్చు. ఒరాకిల్ కంపెనీ పలు…
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే టెక్ మహీంద్రా కంపెనీ మీకు సదవకాశాన్ని అందిస్తోంది. ఆ సంస్థలో ఖాళీగా ఉన్న…
యూకో బ్యాంక్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి…
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇదొక శుభవార్త అనే చెప్పాలి. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. మన…
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…